11_001 మాలతీ సాహితీ మధువు
Malathi sahitee madhuvu
ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో “ప్రమదావనం” పేరిట కాలమిస్టుగా తెలుగు ప్రమదల జీవితాల్లో వెలుగులను నింపిన నిరంతరాన్వేషి మాలతీ చందూర్. కుట్లు, అల్లికలు, వంటలు, వ్యక్తిగత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాది అంశాలపైన అడిగిన అన్ని ప్రశ్నలకి నిక్కచ్చిగ, నిబద్ధతతో ఆమె ఇచ్చే సమాధానాల కోసం తెలుగు మహిళా లోకం ఎంతో అత్రుతగా పడిగాపులు గాచేది. తెలుగింటి ఆడపడుచుల కష్టాలకొక కల్పలతగా భాసిస్తూ ప్రమదావనం సుమారు 50 ఏళ్ళ పాటు ఆంధ్ర మహిళలను అలరించింది.