Madras

13_005 భక్త పోతన – జ్ఞాపకాలు

నాగయ్యగారు వేమనగా కూడా నటించారు. భక్త పోతనలో పోతన గారు ఆయనే !
కొన్ని పాత్రలు ధరించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉండాలేమో ?
ఒక్కొక్క వ్యక్తి మన జీవిత గ్రంధంలో ఒక్కొక్క పుటగా నిలిచిపోతారు. కొందరి కథ చాలా పేజీలు. కొందరిది ఒక చిరునవ్వు. కొందరిది ఒక తియ్యటి మాట.
కొందరిది మనమోహనకరమైన చిత్రం మాత్రమే ! ఇవన్నీ తిరగేస్తుంటే ఏదో నూతనత్వం వస్తుంది. వయసు పెరిగాక మిగిలేవి వజ్రాల వంటి విలువైన జ్ఞాపకాలే !

13_004 తో. లే. పి. – కె. పి. ఎస్. మీనన్

మీనన్ 1921 లో అతి పిన్న వయసు లో, అంటే తన 23 వ ఏటనే Indian Civil Service ( ICS ) లో చేరారు. తొలుత మద్రాసు ప్రెసిడెన్సీ లో చేరి పనిచేసి, అటు తరువాత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ లోనూ పని చేసారు. ఈ విభాగానికి ఎన్నికైన ప్రధముడు ఈయనే. బెలూచిస్ధాన్‌, హైదరాబాద్, రాజపుటానాలలోనూ, కేంద్ర సచివాలయం లోనూ ఆయన తన విధులను నిర్వహించారు.

12_006 మధుర గాయకునితో ఒక జ్ఞాపకం

మాంబళం స్టేషన్ లో ఎలక్ట్రిక్ ట్రైన్ దిగి టి. నగర్, ఉస్మాన్ రోడ్ పట్టుకుని కాలి నడక న వెడుతూ, ఇంటి నెంబర్లు వెతుక్కుంటూ వెళ్లి – చివరకు 35 నెంబరు ఇంటిదగ్గర ఆగి చూసాను. ముందు గేటు, ప్రక్కన ప్రహరీ గోడలో బిగించిన బోర్డు మీద ” ఘంటసాల ” అన్న అక్షరాలు.! ఆ అక్షరాలను చూస్తుంటే సాక్షాత్తూ ఆయన దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. మెల్లగా గేటు తోసి – లోపలకి అడుగు పెట్టాను. పెద్దాయనను చూడబోతున్నామన్న ఆనందాన్ని కప్పి వేస్తూ – ఒక పక్క భయం – ఇంకొక పక్క తడబాటు – వేరొక పక్క ఉత్కంఠ !

11_002 – ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం “ మాలతీ చందూర్ – సామాజిక దృష్టి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు మరియు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ మా అన్నయ్యతో అనుబంధం ” – సోదరీమణుల జ్ఞాపకాలు, చెన్నైలో ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ఆవిష్కరణ, అమెరికా శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “ అమెరికాలో తెలుగు భాషా వికాసం ”….. కార్యక్రమాల విశేషాలు….

11_001 AV రేడియో తాతయ్య

Radio Tatayya – Oleti

‘ శిరాకదంబం ’ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన “ రేడియో తాతయ్య ” ఆకాశవాణి లో మొదటి తెలుగు అనౌన్సర్ కీ.శే. మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారితో ఓలేటి వెంకట సుబ్బారావు గారు జరిపిన ముఖాముఖీ…. మరోసారి……