Mahabhashyam

13_001 లలిత సంగీత ధృవతార

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన “అమృత్” పురస్కారం తనే స్వయంగా అందుకుంటారని నమ్మాను. ఆ అత్యుత్తమ పురస్కారం తరువాత ఇద్దాం, ముందు ఫెలోషిప్ ప్రకటించినవారికి అవి అందజేద్దాం, అన్నారట. నాలాంటి చిత్తరంజన్ అభిమానులు, శిష్యులు ఎంతో నిరాశ చెందారు. కానీ, ఈ అనుభూతులను ఏనాడో దాటేసిన ఆ మహనీయుడు, “అంతా మన మంచికే జరుగుతుంది తల్లీ. సుబ్రహ్మణ్య స్వామి అలా నిర్ణయించారు.” అని చెప్పినట్టు అనిపించింది. ‘ఆయన సమభావాన్ని, నిర్లిప్తతని గౌరవించాలంటే ఆయనని గుర్తించి గౌరవించాలని అనుకున్నవారిని గౌరవించాలి.’ అనిపించింది.