Mandakini

13_009 మందాకిని – శ్రీకృష్ణ కందార్థములు

వ్రేపల్లెలోన పెరిగిన గోపాలుని కథలు విన్న కొండలవంటి పాపములు తొలగి శుభములు ప్రాప్తించును. ఎవరినోట పాడినా, విన్నా శ్రీహరి లీలా జాడ గనుగొనిన
ఏమారు ఏపాటి నెదలను ఎడబాపు పాపములను మాపు, చింతలు మాపు, కుచ్చితంబులు మాపు పాడినా విన్నా||

13_008 మందాకిని – సంసారంలో సరిగమలు

పిల్లలు బయటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెడుతున్నారో, ఎప్పుడు వస్తారో ఇంట్లోవున్న పెద్దవాళ్ళకి చెప్పివెళ్ళమని వారికి బోధించాలి. అలా చేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారని అంటే పిల్లలు విని ఆచరించాలి. ఆ! ఈ ముసలివాళ్ళకి చెప్పేదేమిటి? అనే ఆలోచన, నిర్లక్ష్య౦ మీ మనసులోకి రాకూడదని చెప్పాలి.

13_007 మందాకిని – వృక్షో రక్షతి రక్షితః

తెల్లవారే సరికి రకరకాల పూలు పూసి మురిపించేవి. దొడ్లో కాసిన కూరలు అప్పటికప్పుడు కోసి వండుకొంటే రుచి, ఆరోగ్యం,ఆనందం. జామపండ్లు, మామిడి పండ్లు చెట్టునుండి కోసుకొని,కోరుక్కు తిన్న తృప్తి అనుభవైక వేద్యం.
రోడ్డుకి ఇరువైపులా ఎండకి నీడని,వానకి రక్షణని ఇస్తూ చెట్లు గొడుగులా నిలబడేవి. ఇప్పుడేవీ ? అవన్నీ గతకాల వైభవాలుగా మారిపోయినాయి. ఆ చక్కటి వృక్షాలన్నీ పట్టణాలలో ఆకాశహర్మ్యాలకు బలి అయిపోయాయి.

13_004 మందాకిని – మధుర స్మృతులు

మాడపాటి హనుమంతరావు పంతులుగారు రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి గార్ల కృషి ఫలితంగా బాలికలకు ప్రత్యేకంగా బడి వుండాలనే ఉద్దేశ్యంతో స్థాపింపబడిన బడి మాది. ఐదుగురు బాలికల తో సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ ఎదురుగుండా సందులో ప్రారంభమయిన మా బడి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర గర్ల్స్ హైస్కూల్ గా వాసికెక్కింది.

13_003 మందాకిని – తీర్మానం

మృగరాజు సభ ప్రారంభిస్తూ “ ఈమధ్య మానవజాతిలో మగాళ్లను ‘ మృగాడు ’ అంటూ మనతో పొలుస్తున్నారని తెలిసింది. అలా ఎందుకు అంటున్నారని అడుగుతున్నారా ? ఆ విషయం గురించి చర్చించడానికే ఈ సమావేశం.
వాళ్ళ పురాణాల్లో కీచకుడు, రావణాసురుడు లాంటి కొందరు, ఎంతో గొప్ప రాజులయినప్పటికీ స్త్రీలను అవమానించి చెరబట్టే వాళ్ళని కథలు ప్రచారంలో వున్నాయి. వారికి చెడ్డవారిగా ముద్ర పడింది. అట్లా ఎవరూ చేయకూడదనే నీతిని బోధించే కథలు. కానీ ఈనాడు వారినే కొందరు అనుసరిస్తున్నారు.

13_002 మందాకిని – నీలోత్పల

ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే ఈ జలవాహిని చూస్తూ వుంటే కాలంతో పోటీగా పరుగెత్తాలని ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ పరుగెత్తుకొచ్చే అలలకు కూడా గమ్యం లేదు. నేను ముందంటే నేను ముందు అంటూ వచ్చి ఒడ్డును తాకే అలలు, ఆ అలలు మోసుకొచ్చే అల్చిప్పలు, సముద్రం మీద నుంచి వీచే స్వచ్చమైన గాలి, విస్టారంగా విశ్వమంతా పరుచుకొని ఎక్కడో కనుచూపుకి ఆననంత దూరంగా సముద్రాన్ని తాకుతున్నట్లున్న నీలాకాశం, ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతూ గూళ్లను చేరుకొంటున్న పక్షులు ఇదంతా చూస్తూ వుంటే సృష్టి ఇంత అద్భుతమైనదా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రనక పగలనక హోరుమని శబ్దం చేస్తూ ఉండే ఈ జలరాశి ఇక్కడ ఎప్పటి నుంచి వుంది ? కొన్ని కోట్ల సంవత్సరాల నించి ఇలాగే వుందా ? కదలకుండా ఇక్కడే వుండమని ఎవరు శాసించి వుంటారు ? ఏది ఏమైనా సముద్రం వంక చూస్తూ వుంటే మనల్ని మనం మనం మర్చిపోతాం. ప్రపంచాన్ని మర్చిపోతాం. బాధలు, భయాలు, ఆశలు, నిరాశలు సమస్తం మాయమయి పోతాయి.