12_010 అన్నమాచార్య కళాభిజ్ఞత 15
అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.