Tag Archives: Mucchatlu
…..ద్విభాషితాలు – పని అత్తగారు – అమెజాన్.……
లక్కీ గర్ల్ – నేపధ్యం చిన్నప్పుడు మా ఊరు నుంచి ఎక్కడకు వెళ్ళాలన్నాఓ అయిదు మైళ్ళు కాలినడకనో లేక ఎద్దుల బండి మీదనో వెళ్లే మాకు విమానం చప్పుడు వినిపిస్తే చాలు మా ఆనందానికి పట్టపగ్గాలు ఉండేవికావు. వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. అలా పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళలో ముందు నేనుండేదాన్ని. ఆకాశంలో మోత సన్నగా వినిపిస్తున్నా విమానం ఎక్కడుందో కనిపించేది కాదు. ముందు శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో తెలుసుకుని ఆ తర్వాత జాగ్రత్తగా ఏకాగ్రతగా చూస్తే కాని విమానం కనిపించదు. ఎందుకో