12_010 అమెరికా అమ్మాయితో ముఖాముఖీ 02
విశ్వవ్యాప్తమైన భరతనాట్యము పట్ల నాకున్న ప్రగాఢనమ్మకము, ఆసక్తి, గురువుల వద్ద శిక్షణ, నా నాట్యరీతులకు రూపుదిద్ది, వాటికి ఎన్నో సొగసులను అందించింది. నాట్యానికి భౌగోళికమైన సరిహద్దులు, ఎల్లలు వంటివి లేనేలేవు. నిజం చెప్పాలంటే సమైక్యత, శాంతి, సౌందర్యము కేవలం ఏ కొద్దిమందికో పరిమితం కావు. కళ అన్నది ఒక పరికరము. అది విశ్వవ్యాప్తం. ప్రపంచాన్ని గురించిన విశాల అవగాహన ను కలిగి, జీవితంతో ముడిపడి ఉండడం దాని లక్షణము. లక్ష్యము ..