Poornima

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.

13_006 మాఘం

మౌని అమావాస్య తర్వాత ప్రవేశించిన మాఘమాసం చాలా ప్రత్యేకతలు కలిగి వుంటుంది. శారీరిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే సముద్ర స్నానాలు, సూర్యదేవునికి పూజలు ఈ మాసం ప్రత్యేకత. మాఘపూర్ణిమ రోజున తప్పనిసరిగా చాలామంది సముద్ర స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఈ మాఘమాసంలో స్నానాల ప్రత్యేకతలు, విశేషాలు వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు…..

13_004 కార్తీక మాస ప్రాశస్త్యము

కార్తీక మాసము ప్రత్యేకంగా కుమారస్వామికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. కృత్తికా నక్షత్రములో చంద్రుడు ఉంటుండగా పూర్ణిమ ఉండే మాసము కార్తీక మాసము. ఈ కృత్తికా నక్షత్రములు కార్తికేయునిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారస్వామి యొక్క తల్లులుగా చెప్పబడుతాయి. ఆరు నక్షత్రముల గుంపు ఈ కృత్తికలు.

11_005 AV దేవీ వైభవం

ఆశ్వయుజ మాసంలోముగురమ్మల మూలపుటమ్మగానూ,
కార్తీక మాసం లో మానవుల ఇహపర సాధనకు
ధనలక్ష్మి గా పూజలందుకుంటున్న “దేవీ వైభవం.

11_002 – ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం “ మాలతీ చందూర్ – సామాజిక దృష్టి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు మరియు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ మా అన్నయ్యతో అనుబంధం ” – సోదరీమణుల జ్ఞాపకాలు, చెన్నైలో ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ఆవిష్కరణ, అమెరికా శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “ అమెరికాలో తెలుగు భాషా వికాసం ”….. కార్యక్రమాల విశేషాలు….