Rain

13_007 మందాకిని – వృక్షో రక్షతి రక్షితః

తెల్లవారే సరికి రకరకాల పూలు పూసి మురిపించేవి. దొడ్లో కాసిన కూరలు అప్పటికప్పుడు కోసి వండుకొంటే రుచి, ఆరోగ్యం,ఆనందం. జామపండ్లు, మామిడి పండ్లు చెట్టునుండి కోసుకొని,కోరుక్కు తిన్న తృప్తి అనుభవైక వేద్యం.
రోడ్డుకి ఇరువైపులా ఎండకి నీడని,వానకి రక్షణని ఇస్తూ చెట్లు గొడుగులా నిలబడేవి. ఇప్పుడేవీ ? అవన్నీ గతకాల వైభవాలుగా మారిపోయినాయి. ఆ చక్కటి వృక్షాలన్నీ పట్టణాలలో ఆకాశహర్మ్యాలకు బలి అయిపోయాయి.

13_002 ద్విభాషితాలు – పేద

ప్రకృతి ఒడిలో విభిన్న సౌందర్యాలు…. మనిషి ఆనందం కోసమేనన్న సత్యాన్ని విస్మరించి…. యాంత్రికంగా జీవిస్తున్న మనిషి తీరు ఈ కవితకు ప్రేరణ.

12_011 ద్విభాషితాలు – అమృతవర్షం

ప్రపంచంలోని అన్ని అందాలు మనిషి ఆనందం కోసమే దేవుడు సృష్టించాడు అనేది సత్యం. సౌందర్యాస్వాదనలేని జీవితంకన్నా పేదరికం లేదనేది నా స్వానుభవంలో తెలుసుకున్నాను. ఆ భావనలో వచ్చి పుట్టినదే ఈ అమృత వర్షం అనే కవిత.

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.