Respect

12_009 శ్రీలక్ష్మి – కథ

సదా తన మనసెరిగి ప్రవర్తిస్తూ తన అలవాట్లను..తన బలహీనతల్ని..తన అహంకారాన్నీ..దురుసుతనాన్నీ భరిస్తూ వచ్చిన శ్రీలక్ష్మి, తనను వదిలి వెళ్ళిపోయి అప్పుడే పన్నెండు రోజులైంది అంటే హరిమూర్తి కి నమ్మశక్యంగా లేదు. శ్రీలక్ష్మి ఇక లేదు అన్న సత్యాన్ని, ఆమె సంపాదించుకున్న పేరును ఈ రెంటిని హరిమూర్తి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫ్యూనరల్ టైములో శ్రీలక్ష్మి పట్ల అందరూ చూపించిన గౌరవం, ప్రేమ, దుఖం చూసి అతను ఆశ్చర్యపోయాడు.

11_004 తో. లే. పి. – ఆర్టిస్ట్ వాట్స్

ఒక రచన చదివినా, ఒక చిత్రాన్ని చూసినా మనలో ఒక స్పందన కలగడం సహజం. అయితే, ఆ వెంటనే ఆ స్పందనను ఉత్తరరూపంలో ఆ రచయిత కు కానీ చిత్రకారునికి గానీ తెలియపరచడం పాఠకుని ప్రధమ కర్తవ్యం. అది అవతలివారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. అనడం లో ఎట్టి సందేహానికి తావు లేదు.

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.