12_011 అవధానం
అవధాన ప్రక్రియ అనేది ఒక విశేషమైన, విలక్షణమైన సాహితీ ప్రక్రియ. బహుశా ఈ ప్రక్రియ సంస్కృత భాషలో తప్ప మరే ఇతర భాషల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. ఈ అవధాన ప్రక్రియలో విరివిగా చేసేది ‘ అష్టావధానం ’. ఈ అష్టావధానంలో కవికి ప్రధానంగా ఉండవల్సినది ‘ ధారణా శక్తి ’, సర్వంకషమైన పాండిత్యము, స్పురణ, లోకజ్ఞత. ఉపజ్ఞత, పాండిత్యము కలిగిన అవధాని యొక్క అవధానం మనోరంజకంగా ఉంటుంది.