Sakshaatkaaram

13_007 సాక్షాత్కారము 10

కట్టియలపైకి చేరినకాయ మరరె!
కట్టియలతోడ తానును కాలిపోవు!
కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;
మంట పెట్టుటకై నను బనికివచ్చు!

13_006 సాక్షాత్కారము 09

ఎన్నో బెజ్జము లున్న తనువులో
గాలి నిలుచుటే ఆశ్చర్యం!
గాలిబ్రతుకు లివి రాలిపోవడం.
కానేకా దిది ఆశ్చర్యం!!

13_004 సాక్షాత్కారము 07

చావు ముంచుకొని వచ్చిన
జీవుల కిక భయ మెక్కడ ?
నిరాశ నిండినదీనుల
నిట్టూర్పుల కం తెక్కడ ?

13_002 సాక్షాత్కారము 05

తే. గీ. ఏమహాశక్తి త న్నావహించెనొ ? యన
తరుణిపై పతి ప్రేమగీతాలు పాడు :
అంత నెద పొంగి మగతోడు నరసియరసి
కూర్మి గట్టిగా వాటేసికొను కపోతి !

13_001 సాక్షాత్కారము 04

తే. గీ. ధరణి రాలియు వాడక పరిమళాలు
తఱగనిబొగడపూ లేమితపము చేసె !
ౘచ్చియును కీర్తి దేహాన శాశ్వతు లయి
బ్రతుకు త్యాగుల కివి ఒజ్జబంతు లేమొ !

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !