Satyanarayanarao

13_004 దివ్వెల పండుగ

మానవుడు వెలుగును – ఆథ్యాత్మిక, ఆదిభౌతిక సంపదలకు చెందినది – సంతరించుకోవడం కోసం ప్రాకులాడుతూ వుంటాడు. ప్రాపంచిక రీతులలోనుంచి, గతుల నుంచి తప్పించుకొని, తపస్సిద్ధ్హి సంపన్నుడు కావడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. విజ్ఞాన తేజః పుంజంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ వుంటాడు. అలాటి స్థితికి ప్రతీక దీపావళి. దివ్వెను చూస్తే మనస్సులో ఏదో మువ్వల మ్రోత వినిపిస్తుంది. అది అద్భుతమైన స్పందన. అలాటి వెలుగును కనులారా దర్శించి, మనస్సులో వెలుగులో కలబోయడం కోసమే దీపావళి.