Seethadevi

13_008 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 12

ఎత్తైన, మెత్తని, చక్కని, చల్లని పూల సజ్జపై నీలదేవి కౌగిలిలో ఒదిగి వున్న మా స్వామీ కృష్ణయ్యా ! ఇలా నీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించు. మా విన్నపం ఆలకించి బదులు పలుకు…. అంటూ నీలదేవి కౌగిలిలో సోలి నిద్రించు స్వామిని మేలుకొలుపుతున్నది గోదా…..

13_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11

మనమంతా ఎంత అదృష్టవంతులమో ! శ్రీలు పొంగిన రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చెలులారా ! నిండు జవ్వనులారా !
కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింబవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగంలా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా….. ఇలా గోదాదేవి పాశురాల విశేషాలను వివరిస్తున్నారు.

13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

12_009 రామాయణాల ఇంద్రధనస్సు

అతడా గ్రంథ శ్లోకములందు మరి నాలుగు కావ్యములు గర్చితములగునట్లు కూర్చెను. అయోధ్యకాండ నుండి యుద్ధకాండము వరకును గల శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కలిపి చదివినచో “ గౌరీ వివాహ”మను కావ్యమును – ద్వితీయ పాదములందలి ప్రధమాక్షరములన్నియు కలిపినచో “ శ్రీరంగాది క్షేత్రమహాత్మ్యము ” – తృతీయ పాదాద్యక్షరములన్నియు కలిపినచో “ భగవదవతార చరిత్ర ” కావ్యమును – చతుర్థ పాదమునందలి అక్షరములన్నియు కలిపినచో “ ద్రౌపదీ కల్యాణం ” కావ్యమును ఏర్పడును. బాలకాండమునందలి శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కూర్చినచో “ రామకవచ ”మేర్పడును. ఇది చతుస్సర్గ కావ్యమన ప్రశంసించబడినది.