Simhanandini

12_009 కమలోద్భవ కౌత్వం

కలాపాలు, యక్షగానాలు, నృత్యనాటికలతోపాటు కూచిపూడి నాట్యంలో కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలున్నాయి. వాటిలో సింహనందిని, మయూర కవుత్వం లాంటివి దేవాలయ నృత్యాలు. దేవాలయ ఉత్సవాలలో దేవుడికి అర్పించే క్రతువులివి. ముగ్గుపిండిని ఒకచోట పోసి దానిమీద ఒక క్రమపద్ధతిలో నర్తిస్తే సింహం ఆకారం ఏర్పడడం సింహనందినీ నృత్యం. నెమలి ఏర్పడేట్టు చేసే ఇంకొక ప్రక్రియ మయూర కవుత్వం.