Siva

13_009 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 13

చెన్నమల్లేశ్వర స్వామిని సేవించి, ఆయనకు భక్తురాలై, ఆయన సేవలోనే జీవించి, ఆ దైవం లోనే ఐక్యమైన అక్కమహాదేవి కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లా ఊదుతాడి గ్రామంలో క్రీ. శ. 1130వ సంవత్సరంలో వీరశైవుల ఇంట జన్మించింది. బాల్యంలోనే చెన్నమల్లిఖార్జునుని తన భర్తగా స్వీకరించి, ఆయన భావనలోనే కాలం గడిపేది. అప్పట్లో జైన మతవాలంబుడైన ఆ దేశాన్ని ఏలే రాజు కౌశికుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై పెళ్లాడతానని కబురు చేశాడు. మొదట ఒప్పుకోకపోయినా తల్లిదండ్రులను, బంధువులను రాజు దాష్టీకన్నుంచి తప్పించడానికి తల ఒగ్గక తప్పలేదు.

13_008 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 12

ఎత్తైన, మెత్తని, చక్కని, చల్లని పూల సజ్జపై నీలదేవి కౌగిలిలో ఒదిగి వున్న మా స్వామీ కృష్ణయ్యా ! ఇలా నీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించు. మా విన్నపం ఆలకించి బదులు పలుకు…. అంటూ నీలదేవి కౌగిలిలో సోలి నిద్రించు స్వామిని మేలుకొలుపుతున్నది గోదా…..

13_007 శంభో మహాదేవ…

పరమ దయా కర మృగ ధర హర గంగా ధర ధరణీ
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివేశ….
పంతువరాళి రాగం, రూపక తాళం లో త్యాగరాజ కీర్తన….

13_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11

మనమంతా ఎంత అదృష్టవంతులమో ! శ్రీలు పొంగిన రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చెలులారా ! నిండు జవ్వనులారా !
కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింబవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగంలా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా….. ఇలా గోదాదేవి పాశురాల విశేషాలను వివరిస్తున్నారు.

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

13_004 సంగీతం – సర్వేశ్వరుని చేరే సాధనం 09

భక్త వాగ్గేయకారుల జీవితాలు మహిమాన్వితాలని చెప్పుకున్నాం కదా ! తులసీదాసు విషయంలో కూడా జరిగిన ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఒకనాడు ఒక స్త్రీ విలపిస్తూ తులసీదాసు పాదాలకు నమస్కరించింది. ఆమెను ‘ దీర్ఘసుమంగళీభవ ‘ అంటూ ఆశీర్వదించాడు. ‘ నన్నెందుకు అవహేళన చేస్తారు స్వామీ ! నా భర్త చనిపోయారు. ఆ దుఃఖం లో ఉండి మీకు నమస్కరించాను ’ అంటుంది.
“ తల్లీ నాకు నిజంగా నీ భర్త మరణించిన విషయం తెలియదు. అప్రయత్నంగా అలా ఆశీర్వదించాను. రాముడే నా నోట అలా పలికించి ఉండాలి. ఆ వాక్కులు వృథా కారాదు. నీవు వెళ్లి చనిపోయిన నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు. విశ్వాసంతో వెళ్ళు ” అంటారు. ఆమె అలాగే చేస్తే ఆమె భర్త బతికాడు.

13_001 కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం

భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.

12_012 తిరువారూరు విశిష్టత

కాలం చేసిన తరువాతే “ సంగీత త్రిమూర్తులు ” గా పేరు గాంచినా, వారికి మాత్రం ముందే తెలిసిందేమో…. తాము కారణ జన్ములమని, అందుకే ముగ్గురూ ఒకే ఊరిలో, అది కూడా ఒకే ఆలయానికి దగ్గరలో జన్మించారు. ఒకే కాలంలో జీవించి సమకాలికులయ్యారు. ఆ పుణ్యభూమే తమిళనాడులోని తిరువారూరు. వారు పుట్టిన తరువాత వారి వారి కుటుంబాలు తిరువయ్యూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్ళినా చరిత్రకు ఆనవాళ్ళుగా, సంగీత విద్యార్థులకు తీర్థ యాత్రా స్థలాలుగా ఇప్పటికీ ఆ మహా వాగ్గేయకారులు జన్మించిన ఇల్లు వెలుగొందుతున్నాయి.

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !