Songs

13_005 తో. లే. పి. – అన్నయ్య వి. భూపతిరావు

స్కూల్ చదువు పూర్తి అవగానే మా అన్నయ్య కాకినాడ, పి.ఆర్. కాలేజీ లో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వ విద్యాలయం, వాల్తేరు లో B.E., ( Electrical Engineering ) పూర్తి చేసాడు. అప్పుడు కాలేజిలో వాడికి కొలీగ్స్.. ఆప్తమిత్రులు గొల్లపూడి మారుతీరావు, వీరాజీ‌, జ్యేష్ట, కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రభృతులు. వీరి సాహచర్యంలో వాడికి నాటకాలు, రచనలు‌, పాటలు పాడడం వగయిరాలతో అనుబంధం ఏర్పడింది.
తరువాత ఉద్యోగ పర్వం.

11_008 ముకుందమాల – భక్తితత్వం 03

ముకుందః! దేవః! దేవకీనందన జయతు జయతు మోక్షమునిచ్చే వాడు ముకుందుడు. ఎవరీ ముకుందుడు ? మా దేవకీనందనుడే! తానెక్కడో గోలోకంలోనో, వైకుంఠంలోనో ఉంటే మనం తనను చేరలేమనీ, పొందలేమనీ, తానే దిగివచ్చి, తనచేత సృష్టించబడిన ఈ జగత్తులో, ఒక తల్లిగర్భాన పదినెలలు వసించి, ఆ తల్లి కడుపుపంటగా, ఆనందసంధాయకుడై, జన్మించినాడు.

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.

11_004 సంపూర్ణమైన పండుగ – బతుకమ్మ పండుగ

కుంకుమలో, పూలలో, అక్షింతలలో పుట్టిన గౌరమ్మా అంటూ అన్నింటినీ కలిపి చెప్తూ, అన్ని కులాల పేర్లు కూడా చెప్తూ పాట పాడుతారు. అంటే, అందరూ కులమతాలను వీడి, వాటికి అతీతంగా కలసికట్టుగా ఈ పండుగను స్త్రీలు, పిల్లలు కలసి చేసుకుంటారని అర్థమవుతుంది.

11_002 అన్నమయ్య – పోతన

ఒకరిది పద సాహిత్యమైతే, మరొకరిది పద్య సాహిత్యం. అన్నమయ్య పదాల్లో సాహితీ విలువలున్నాయి. పోతన పద్యాల్లో సంగీత బాణీలున్నాయి. వీరి పద పద్యాలు పరిశీలిస్తే నిత్య సత్యాలు, జీవన విధానం, దాని విలువలు, నిర్మలమైన మనోభావాలు, స్ఫూర్తి, మోక్షానికి మార్గం లాంటి సూత్రాలు కనిపిస్తాయి. “ఏకం సత్” అంటే శాశ్వతమైన పరమాత్మని అనన్యమైన భక్తితో స్తుతించి మోక్షాన్ని పొందారు అన్నమయ్య పోతనలు.