Sonty

12_008 సునాదసుధ – నగుమోము గనలేని

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన గిటార్ పైన బర్కిలీ స్కూల్ సంగీత విశ్వవిద్యాలయంలో పాశ్చాత్య శాస్రీయ సంగీతంతో పాటు భారతీయ కర్ణాటక సంగీత బాణీ లో ప్రతిభ పొందిన “ జో రూఎన్ “, హిందూస్తానీ తబలా వాద్యంలో పేరు పొందిన “ ధనంజయ్ కుంటే “ ల ప్రదర్శన.
అభేరి రాగం, అది తాళం, త్యాగరాజ కీర్తన.

12_008 అన్నమాచార్య కళాభిజ్ఞత 13

మనకి తెలిసినంతవరకు అన్నమాచార్యుడు మొట్టమొదటి ప్రజాకవి. అంటే తెలుగు భాషా వ్యవహార కవి అని చెప్పుకోవాలి. 15వ, 16వ శతాబ్దాల నాటి భాష, పలుకుబదులు, వ్యవహార విధానాలు, నిత్య జీవన సరళులు అన్నిటినీ కూడా పదాలుగా మలచి ప్రజల మనసులకి చేరువయ్యాడు.

11_005 AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 02

సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.

11_003 తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత

అమెరికా చికాగొ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ సాహిత్యం, కళలకు సేవలందిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకులు డా. శారదాపూర్ణ శొంఠి గారి “ తాళ్ళపాక అన్నమాచార్యుని సంగీత, నృత్య కళాభిజ్ఞత ” గురించిన సోదాహరణ ప్రసంగ పరంపర లో మొదటి భాగం….