13_001 బాబ్జి బాకీ
తీర్థంలో అమ్మే గూడు బండి కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉండేది, మూడు చక్రాలతో చిన్న చక్కబండి, పైన గూడులా రేకుతో చూడటానికి భలేవుండేది. తాడుకట్టి లాగుతుంటే మేమే ఆ బండి ఎక్కినంత ఆనందపడేవాళ్ళం. ఆ బండి ఖరీదు రెండురూపాయలు. మాకిచ్చేది పావలా మాత్రమే. రెండు రూపాయలు ఇవ్వండి బండి కొనుక్కుంటాను అని అడగడం మాకు తెలీదు. ఇంట్లో పిల్లలందరికీ పావలా మించి ఇచ్చేవారు కాదు. ఆ పావలా కోసం, ఆ తీర్థం కోసం రెండు నెలల ముందు నుండీ ఎదురుచూసేవాళ్ళం.