12_008 తాండవ శివుని పంచసభలు
శివ నర్తనం చూడాలన్న సంకల్పంతో ఆదిశేషుడు వ్యాఘ్రపాదుడనే ఋషితో కలిసి తపస్సు చేశాడు. ప్రసన్నుడైన శివుడు ఆనంద తాండవం చేసిన వేదిక కనక సభ. రెండు వేల సంవత్సరాలుగా వాస్తు, శిల్ప, ప్రదర్శనా కళల శాస్తాలను ప్రభావితం చేస్తున్న చిదంబరం దేవాలయంలో కనక సభ నెలకొని ఉంది.