Telangana

13_001 కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం

భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.

11_004 సంపూర్ణమైన పండుగ – బతుకమ్మ పండుగ

కుంకుమలో, పూలలో, అక్షింతలలో పుట్టిన గౌరమ్మా అంటూ అన్నింటినీ కలిపి చెప్తూ, అన్ని కులాల పేర్లు కూడా చెప్తూ పాట పాడుతారు. అంటే, అందరూ కులమతాలను వీడి, వాటికి అతీతంగా కలసికట్టుగా ఈ పండుగను స్త్రీలు, పిల్లలు కలసి చేసుకుంటారని అర్థమవుతుంది.