Telugu

12_007 సప్తపర్ణి – సమీక్ష

ఆలోచనలు అవాక్కైనప్పుడు కళ్ళలో చూపులు కూడా స్థంభించిపోతాయి. మనదనుకునే మన సొత్తు అవే కదా ! ఇక ప్రకటనకి అవకాశమేదీ ? నీ స్పందన విశ్లేషణ చదివిన తర్వాత నేను వ్రాయటం నా అహంకారమే నని స్పష్టమయింది. ఎదురుగా ఉంటే నమస్కారమైనా పెట్టేదానిని లేదా ప్రేమపుటాలింగనమైనా ఇచ్చేదానిని. నాకు నా జీవితంలో ఇంతటి భవ్యమైన చెలిమి వెలుగుందన్న భావన అణకువ నేర్పుతోంది. నువ్వు చిన్న నాటినుంచీ అందమైన ఆశ్చర్యానివే !

12_007 మా ఇంట అడుగేసేను

సంక్రాంతి పాట
వడ్డేపల్లి కృష్ణ రచన, శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో పద్మజ శొంటి గారి గానం….

12_007 ద్విభాషితాలు – మహాప్రపంచం

సాంకేతిక అభివృద్ధి ఎంత వేగంగా చోటు చేసుకొంటోందో …. అంతే వేగంగా ప్రపంచ పర్యావరణం… సంఘ వినాశనం… మానవతా విలువల పతనం సంభవిస్తున్నాయి. ఆ ఆవేదనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపం ఇది. ఈ కవితకు ప్రేరణ Bertrand Russell యొక్క వ్యాసం Man’s Peril.

12_007 ముకుందమాల – భక్తితత్వం

ఏనుగు కొలనులో దిగి శుభ్రంగా స్నానం చేస్తుంది. తిరిగి బైటికి రాగానే దుమ్ముని మీద చిమ్ముకుంటుంది! మరింత దుమ్ము అంటుకోవడానికే కానీస్నానం వలన ప్రయోజనమేమీ ఉండదు. అందుకే భక్తిహీనకార్యాన్ని గజస్నానంతో పోలుస్తారు
అందుకే తీర్థయాత్రల్లో స్నానం చేశాము అనుకోవడం రాజసం పెరగడానికి కాకరజస్తమస్సులు తొలగి సత్వగుణం పెరిగిభగవత్ప్రాప్తిని కల్గించడానికి ఉపయోగపడాలి. శ్రీమన్నారాయణ చరణ స్మరణ పూర్వకంగా చేసిన నాడు అలా ఫలప్రాప్తిని పొందవచ్చు భగవదనుగ్రహంతో.

12_007 ఉత్తరాయణం

సూర్యుడు తన నిరంతర యానంలో మకర రాశిలోకి ప్రవేశించే రోజునే ‘ మకర సంక్రాంతి ‘ అని పిలుస్తారు. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు కు సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకునే సందర్భాన్ని ‘ ఉత్తరాయణం ‘ అని అంటారు. ఈ ఉత్తరాయణం చాలా విశిష్టమైనది. ‘ ఉత్తరాయణ పుణ్యకాలం ‘ అనడం అందరూ వినే ఉంటారు. ఆ విశేషాలేమిటో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు గతం లోని ఈ వీడియోలో వివరిస్తున్నారు.

12_006 వార్తావళి

గ్లోబల్ ఐ GSA ఇండియా వారు అమెరికాలో నిర్వహిస్తున్న “ Educational Connect Workshop ” వివరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న “ డిజిటల్ మూవీ వర్క్‌షాప్ “ వివరాలు…..

12_006 ఆనందవిహారి

అమెరికాలోని చికాగొ లోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( సప్నా ), భారతీ తీర్థ వారి సంయుక్త అధ్వర్యంలో జరిగిన తెలుగు సాహిత్య సభ “ విశ్వ వేదిక మీద తెలుగు సాహిత్యం ” కార్యక్రమ విశేషాలు…..
చెన్నై అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా 31వ సంచిక “ తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియాలో తొట్టతొలి మహిళా జర్నలిస్ట్ ” ముఖాముఖీ, 32వ సంచిక అమరజీవ్ పొట్టి శ్రీరాములు, ఆయన శిష్యులు వై. ఎస్. శాస్త్రి, చిత్ర… చలనచిత్రకారులు బాపు గార్ల గురించి “ ముగ్గురు తేజోమూర్తులు ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు….

12_006 విహారి

ప్రకృతి ప్రేమికుణ్ణి కావడం చేత ప్రతి సంవత్సరం ప్రకృతి స్వరూపాలైన అడవులు…పర్వతాలు లోయలు.. దర్శించడం… ఆ అనుభూతుల్ని నెమరు వేసుకోవడం.. అవి అక్షర రూపం దాల్చడం ఓ అలవాటుగా మారింది. అలా ఉద్భవించిందే.. ఈ “విహారి” అనే కవిత!