tool

13_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11

మనమంతా ఎంత అదృష్టవంతులమో ! శ్రీలు పొంగిన రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చెలులారా ! నిండు జవ్వనులారా !
కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింబవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగంలా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా….. ఇలా గోదాదేవి పాశురాల విశేషాలను వివరిస్తున్నారు.

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

13_004 సంగీతం – సర్వేశ్వరుని చేరే సాధనం 09

భక్త వాగ్గేయకారుల జీవితాలు మహిమాన్వితాలని చెప్పుకున్నాం కదా ! తులసీదాసు విషయంలో కూడా జరిగిన ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఒకనాడు ఒక స్త్రీ విలపిస్తూ తులసీదాసు పాదాలకు నమస్కరించింది. ఆమెను ‘ దీర్ఘసుమంగళీభవ ‘ అంటూ ఆశీర్వదించాడు. ‘ నన్నెందుకు అవహేళన చేస్తారు స్వామీ ! నా భర్త చనిపోయారు. ఆ దుఃఖం లో ఉండి మీకు నమస్కరించాను ’ అంటుంది.
“ తల్లీ నాకు నిజంగా నీ భర్త మరణించిన విషయం తెలియదు. అప్రయత్నంగా అలా ఆశీర్వదించాను. రాముడే నా నోట అలా పలికించి ఉండాలి. ఆ వాక్కులు వృథా కారాదు. నీవు వెళ్లి చనిపోయిన నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు. విశ్వాసంతో వెళ్ళు ” అంటారు. ఆమె అలాగే చేస్తే ఆమె భర్త బతికాడు.

12_006 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 05

పంచాక్షరీ జప తత్పరుడైన లీలాశుకునికి ఎప్పుడో ఒకసారి బాలకృష్ణుని ముగ్ధ మనోహర రూపం కనులకు సాక్షాత్కరించిందట. అంతే అప్పటినుండి మనసు నిండా నందకిశోరుడే నిండిపోయాడు. ఆ స్వామి భావనలో మునిగిపోయిన లీలాశుకుడు గోపాల బాలుని శైశవ లీలలు, అతి మానస చేష్టలు, వేణు రవామృత ఘోషలు, ముద్దుకృష్ణుని రూప లావణ్య వర్ణనలు, కన్నయ్య తలపులోని భక్తి పారవశ్యం రాగరంజితాలై శ్లోక రూపంలో హృదయ కర్ణామృతాలై కృష్ణానందంలో తెలియాడిస్తాయి…. చదువరుల మనసును కూడా…