Train

13_006 ద్విభాషితాలు – పొగబండి

బాల్యంలో పొందిన అనుభూతులు కొన్ని జీవితకాలం వెంటాడి మనకు తీయని బాధను కలిగిస్తాయి. నా బాల్యంలో మనసును దోచుకున్న పొగ రైలుబండి ఈ కవితకు ప్రేరణ.

12_009 ద్విభాషితాలు – వెన్నెలబండి

వెన్నెల రాత్రి…రైలు బండి సాధారణ బోగీలో..కిటికీ ప్రక్కన మెలకువగా కూర్చుని.. ప్రయాణించడం ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభవం లోంచి పుట్టిన కవితకు దృశ్య శ్రవణ రూపం… ఈ “వెన్నెల బండి”

12_009 అమెరికా అమ్మాయితో ముఖాముఖీ 01

శాస్త్రీయ నృత్య కళారీతులకు అనుగుణంగా చిదంబరం లోని శ్రీ నటరాజస్వామి వారి దేవాలయ ప్రాంగణం లో నాట్య గురువు శ్రీ వెంపటి చిన సత్యం గారి కొరియోగ్రఫీ లో చిత్రీకరణ జరిగిన నా నాట్య ప్రదర్శన కు ఆధారమైన పాట డాక్టర్ శ్రీ సి. నారాయణరెడ్డి గారి రచన ” ఆనంద తాండవమాడే…శివుడు అనంతలయుడు ..”. ఈ పాట, తదనుగుణంగా శాస్త్రీయ నృత్యం నా పాత్ర కు జీవం పోసాయి అని ఘంటాపధం గా చెప్పవచ్చును.

12_006 మధుర గాయకునితో ఒక జ్ఞాపకం

మాంబళం స్టేషన్ లో ఎలక్ట్రిక్ ట్రైన్ దిగి టి. నగర్, ఉస్మాన్ రోడ్ పట్టుకుని కాలి నడక న వెడుతూ, ఇంటి నెంబర్లు వెతుక్కుంటూ వెళ్లి – చివరకు 35 నెంబరు ఇంటిదగ్గర ఆగి చూసాను. ముందు గేటు, ప్రక్కన ప్రహరీ గోడలో బిగించిన బోర్డు మీద ” ఘంటసాల ” అన్న అక్షరాలు.! ఆ అక్షరాలను చూస్తుంటే సాక్షాత్తూ ఆయన దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. మెల్లగా గేటు తోసి – లోపలకి అడుగు పెట్టాను. పెద్దాయనను చూడబోతున్నామన్న ఆనందాన్ని కప్పి వేస్తూ – ఒక పక్క భయం – ఇంకొక పక్క తడబాటు – వేరొక పక్క ఉత్కంఠ !