Web magazine

13_001 అన్నమాచార్య కళాభిజ్ఞత 16

తాళ్ళపాక పద కవితలు గాన విధానాన్ని బట్టి నాలుగు విధాలుగా ఉన్నాయి. వ్యక్తి గాన పదాలు అంటే స్త్రీలు స్త్రీలకోసం పాడుకునేవి, పురుషగాన సంప్రదాయాలు. సమూహ పదాలు అంటే ఇద్దరూ కలిసి పాడుకునేవి, సంవాద పదాలు అంటే స్త్రీ పురుషుల మధ్య సంవాదము, సంభాషణ, చర్చ జరిగినవి, ప్రక్రియా పదాలు అంటే విషయాన్ని అనుసరించి అంశానికి అనుగుణంగా స్త్రీలు, పురుషులు కలిసి లేదా విడివిడిగా సంభాషణ అనే ప్రక్రియలలో అన్నమాచార్యులు రచనలు చేశారు. భాషా బేధాన్ని బట్టి ఆంధ్ర భాష, సంస్కృత భాష, గ్రామ్య భాష లోనూ సంకీర్తనా రచనలు చేశారు అన్నమాచార్యులు.

13_001 సాక్షాత్కారము 04

తే. గీ. ధరణి రాలియు వాడక పరిమళాలు
తఱగనిబొగడపూ లేమితపము చేసె !
ౘచ్చియును కీర్తి దేహాన శాశ్వతు లయి
బ్రతుకు త్యాగుల కివి ఒజ్జబంతు లేమొ !

13_001 ఓయి భారతీయుడా !

విశ్వశాంతి కాంక్షించే వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ సోదరా

13_001 కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం

భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.

13_001 దక్షిణాయనం

ఉత్తరాయణం, దక్షిణాయనం అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశించబడి ఉంటాయి. సూర్యోదయాన్ని రోజూ గమనిస్తూ ఉంటే తూర్పునే ఉదయిస్తున్నా ఒకే ప్రదేశంలో ఉదయించడం లేదని గమనించవచ్చు. అంటే రోజు రోజుకీ ఉదయించే ప్రదేశం కొద్దిగా మారుతూ వస్తుంది. ఇలా సూర్యుడు జరిగే దిశను బట్టి ఈ విభజన జరిగింది. ఉత్తరం వైపు జరిగితే ‘ ఉత్తరాయణం ’ గా, దక్షిణం వైపు జరిగితే ‘ దక్షిణాయనం ’ గా పిలుస్తారు. ఉత్తరాయణ కాలంలో నీటి ఆవిరి రూపంలో పైకి తీసుకున్న నీరంతా దక్షిణాయన కాలంలో క్రిందకు వర్షం రూపంలో తిరిగి వస్తుంది. భగవంతుడు ఈ దక్షిణాయనం లో మనకోసం క్రిందకు దిగివస్తాడని చెప్పుకుంటారు.

12_012 వార్తావళి

“ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు, “ డయస్పోరా తెలుగు కథానిక ”, వివరాలు, …..

12_012 ఆనందవిహారి

అమెరికా లోని చికాగో నగరంలో జరిగిన అంతర్జాతీయ వీణా ఉత్సవాలలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు వీణాపాణి ప్రదర్శన విశేషాలు,……