09_017 పసితనం – పసిడిమయం

7 Replies to “09_017 పసితనం – పసిడిమయం”

 1. మన తొలి దండ్రులు అన్నా చెల్లెలయ్యారా అన్పిస్తుంది వయస్సు పైబడిన సంతానానికి. వాళ్ళ పోల్తులు అభిమానించే పిల్లలకు ఉండటం సహజమే. కాలాలు మారినా ప్రపంచం పురోగమించినా అనుబంధాలూ ఆప్యాయాలు సూర్యచంద్రులు న్నంతవరకూ ఉంటాయి. పోతే తీరు మారింది. అప్పుడు మామయ్య జీళ్ళు కొని పెడితే ఇప్పటిమామ చాక్లెట్స్ తో ముద్దు చేస్తున్నాడు.

 2. మీ అపురూపమైన బాల్య అనుభవాలను ఈ తరానికి కళ్ళకి కట్టినట్టు చూపించారు.

 3. ఈ రచన చదువుతున్న అంత సేపు “అవును కదూ ఇలాగే నాక్కూడా” అని అనిపించక మానదు. అమ్మగారి పుట్టిల్లు ఆ పరిసరాలు, అక్కడ మనకు లభించే ప్రత్యేక ఆప్యాయత తప్పక గుర్తుకొస్తాయి. ఒక్కసారిగా వెనక్కి వెళ్లి ఆ పసి తనాన్ని తిరిగి అనుభవించాలని పిస్తుంది.

 4. అమ్మమ్మ బేసీన్లో కలిపిన ఊరగాయల రుచులు బాల్యాన్ని తట్టి లేపి చవులూరిస్తున్నాయి. అమ్మమ్మ కడియాల సవ్వడి మనసును నిద్దుర లేపి పసితనపు మమకార మాధుర్యాన్ని మరోసారి రుచి చూపించిన కృష్ణ మోహన్ గారు అభినందనీయులు. నిరుపయోగమైన వస్తువులను అపురూప మైన ఆటవస్తువులుగా చేసుకొని మురిసిన ఆనాటి తరాన్ని, నేటి తరానికి పరిచయం చేయడం ముదావహం. డాక్టర్. యర్రమిల్లి ఆదిలక్ష్మి

 5. Dear editor

  E రోజు సాయంత్రం ఎందుకో సిరా కదంబ సంచికని యధలపంగా చూడడం జరిగింది. అందులో పసితనం, పసిడి మయం అన్న శీర్షిక ఆకర్షించింది.

  సరే ఒకసారి చదువుదాం అని చదివాను. మళ్లీ ఎందుకో మరొకసారి చదువుదాం అనిపించింది. మళ్లీ మళ్లీ చదివాను.

  ఒక్క సారిగా ఆశ్చర్యం అనిపించింది. అరె ఈయనికి నా బాల్యం గురించి ఎలా తెలుసు?. కాదు కాదు ఈయనకి చాలా మంది బాల్యం గురించి చిన్నతనం గురించి తెలుసు నేమో అని అనిపించింది.

  అదే కథకుడు మనుషుల ఆలోచన లోంచి హృదయాల లోకి తొంగి చూసి రాస్తాడు కదూ.

  ఆ ! ఆ పరకాయ ప్రవేశము అన్న ప్రక్రియే ఇక్కడ జరిగింది.

  సరే ఇంత చక్కటి జర్నీ ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక నన్ను నేను relate చేసుకొన్నాను. సరే కానీయ్ అన్నాడు.

  బస్ ఎక్కించాడు. పడవ ఎక్కించాడు. పడవలో కొబ్బర్ణోజు కొనిపెట్టమని అడిగాను. కళ్ళతోనే వారించాడు వద్దని. చిన్నబుచుకొనాను. గమనించాడు.

  అమ్మమ్మ గారింటికి వెళ్ళాం. మండు వేసవి ఎండలు చుర్రు మనిపించెలా చేశాడు. చక్కటి సాయం కాలపు గాలిలొ సేద తీర్చాడు. రోజూ మొదలయ్యే చద్ది అన్నం తో బ్రేక్ఫాస్ట్ చేయించాడు. ఊరి పెద్దలు ఆప్యాయంగా ఇచ్చిన బంగినపల్లి మామిడి పండ్లు రుచి చూపించాడు. రసాలురు రసాలు చవి చూపించాడు.
  అంతేనా తేనే మాధుర్యాన్ని చవి చూడమని పనస తొనలు తినిపించాడు.

  గోటి తో మీటితే చేదిరేటటువంటి తాటి ముంజలు తినిపించాడు. ఆట విడుపు కోసం ఆ ముంజల్నే బండి గా చేసి ఆడుకో అన్నాడు.

  అమ్మమ్మ, మావయ్య, అత్తయ్య ల మమకారాన్ని పంచాడు. వెరసి పదే పదె తల్చుకొనెలా ఒక చక్కని అనుభూతిని మిగిలిచ్చాడు.

  తన విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ, తన పర్యటన తాలూకు జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ, మనవల తో హాయిగా ఆడుకుంటున్న సమయాన, తన గత స్మృతుల లోకి జారుకొని, మధురాతి మధురమైన ఆ బాల్య జ్ఞాపకాలని మనకందించిన ఆ వ్యక్తి ఎవరో మీకు చెప్పలేదు కదూ.

  ఆ! ఆయనే నా మిత్రుడు, సహాధ్యాయి మాస్టారు గారి అబ్బాయి, శ్రీ కృష్ణ మోహన్.

  ఒక భావనని అక్షర రూపం ఇవ్వాలని ఉన్నా అందరికీ అది సాధ్యమయ్యే పనికాదు. అది ఏ కొద్దిమంది మాత్రమే చేయగలరు.

  నాకు ఒకరకంగా ఆశ్చర్యం గా ఉంది / ఆశ్చర్యంగా కూడా లేదు.

  ఎందుకంటారా సాహితీ సంపదని మాస్టారు లక్ష్మీపతి రావు గారినుంచి వారసత్వం గా పొందిన కృష్ణమోహన్
  ఇటువంటి కథనాలు వ్రాయడంలో ఆశ్చర్యమేమీ లేదు.

  ఇటువంటి మరిన్ని అణిముత్యాలు, కథనాలు మిత్రుడు కృష్ణమోహన్ కలం నుండి రావాలని ఆశిస్తూ, శుభాభినందనలు తెలుపుకొంటు, ప్రచురించిన సిరా కదంబం రామచంద్ర రావు గారికి, సంపాదక వర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటన్నాను.

  ఇట్లు

  D. శ్రీనివాస రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *