ఇంక 2020 నిష్క్రమించడానికి రెండు నెలలే మిగిలాయి. ఈ సంవత్సరమంతా కల్లోలంగానే గడిచింది… ఇంకా గడుస్తోంది. కరోనా సృష్టించిన కల్లోలమిది. ఈ కరోనా కాటుకి సామాన్యులే కాదు. ఎంతోమంది ప్రముఖులు కూడా బలయ్యారు. ఎప్పటికప్పుడు డాక్టర్లు, సైంటిస్టులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వారి లెక్కలన్నీ తారుమారు చేసింది. తగ్గినట్లే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ఎవరి అంచనాలకీ అందటం లేదు. ఈ రెండు నెలల తర్వాత క్రొత్త సంవత్సరంలోనైనా శాంతిస్తుందా అన్నది ప్రతి ఒక్కరి లోనూ ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది. మళ్ళీ విజృంభణ ప్రారంభమయిన కారణంగా మరో ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ప్రత్యామ్నాయం ఇప్పటికిప్పుడు మనకి అందుబాటులో లేదు. అందువలన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించడమే ఉత్తమం అని అందరూ గ్రహిస్తే తమని రక్షించుకోవడంతో బాటు సమాజాన్ని కూడా రక్షించిన వారవుతారు.
ఈ కరోనా పుణ్యమాని కొన్ని పాత అలవాట్లు, సంప్రదాయాలలోని గొప్పదనాన్ని అందరూ ఒప్పుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడవే క్రొత్త రూపు సంతరించుకుని ఆధునికంగా ఉపయోగంలోకి వచ్చాయి. మనం ఏవి నిర్లక్ష్యం చేస్తున్నామో వాటిని గుర్తు చేస్తున్నాయి. అలాగే మరికొన్ని క్రొత్త అలవాట్లు మన జీవితాల్లోకి వచ్చి చేరాయి. వాటిలో ఇంటినుంచే ఆన్లైన్ తరగతులు, ఆన్లైన్ సమావేశాలు పెరిగాయి. దీనివలన సమయం, ధనం వంటివెన్నో ఆదా అవుతున్నా వీటి మీద ఆధారపడిన కొంతమంది ఉపాధి కోల్పోతున్నారు.
ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో చాలా జాగ్రత్తగా నాలుగు గోడల మధ్యా ఉంటూ…ఎప్పటికప్పుడు శుభ్రత పాటిస్తూ అద్దాలమేడ లో ఉన్నామనుకునే వాళ్ళకి ఎక్కువగా వస్తున్న ఈ కరోనా బిచ్చగాళ్ళకు, పొలాల్లోను…నిర్మాణ రంగం వంటి వాటిలోనూ పనిచేస్తున్న కార్మికులు వంటి వారిలో కరోనా వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని తెలిసింది. దానికి వారిలో వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉండడమేనని తేలింది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇంతటి మహమ్మారి కూడా మట్టిలో బ్రతికే వారికీ, మట్టిలో పని చేసేవారికి తల వంచింది. అది ‘ మట్టి ‘ మహాత్మ్యం. ఇప్పటికైనా నాగరీకులమనుకునే వారు ‘ మట్టి పిసుక్కునే వాళ్లు ‘ అని హేళన చెయ్యడం మానేసి ‘ మట్టి ‘ విలువను గ్రహిస్తే ఇలాంటి మహమ్మరులు ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చెయ్యలేవని గ్రహిస్తే అందరికీ మంచిది.
********************************************
ఉన్నతవిద్య గగన కుసుమంగా ఉన్న రోజుల్లో…. చదువుకోవాలంటే రెండు మూడు రేవులు దాటి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్లవలసిన రోజుల్లో… అంటే1950 ప్రాంతాల్లో… చుట్టూ సముద్రం, గోదావరి నీటితో నిండి మధ్యలో దీవి లాగా ఉండే డెల్టా కోనసీమ ప్రాంతంలో ఒక కళాశాల ఉంటే ఉన్నత విద్య చదువుకోవాలనుకునే ఆ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని, వారి భవిష్యత్తు బంగారం అవుతుందనే ఉద్దేశ్యంతో కొందరు పెద్దలు ప్రారంభించిన యజ్ఞానికి తమ తోడ్పాటు నందించి తమ జమీ యే కాదు…తమ మనసు కూడా విశాలమే అని నిరూపించారు పేరూరు జరిమిందారులు శ్రీ భానోజి రామర్స్ గారు. కళాశాల నిర్మాణానికి అవసరమైన విశాలమైన స్థలంతో బాటు, అప్పటి రోజుల్లోనే ( 1950 ) లక్షరూపాయలు నగదు కూడా విరాళంగా ఇచ్చిన సహృదయులు భానోజి రామర్స్ గారు. ఈ కళాశాల కోనసీమలోని ఎందరికో విద్యాభిక్ష పెట్టి, ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేసింది.
భానోజి రామర్స్ గారి పెద్ద కుమారులైన శ్రీ జె. వి. జి. ఆర్. భానో గారు తండ్రి గారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని కళాశాల కు సెక్రెటరీ & కరెస్పాండెంట్ గా తన సేవలందిస్తూ కళాశాల అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. వారు ఈ అక్టోబర్ 30వ తేదీ ఉదయం అనూహ్గా కన్ను మూయడం అత్యంత విషాదకరం. వారి మరణం వారి కుటుంబానికి, కళాశాల కే కాదు… కోనసీమ అంతటికీ తీరని లోటు. స్వర్గీయ భానో గారికి సద్గతులు కలగాలని కోరుకుంటూ… వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది ‘ శిరాకదంబం ‘.
********************************************
కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అక్టోబర్ వివరాలు –
శ్రీ పి, వి. రమణ శర్మ, తిరువణ్ణామలై – రెండు సంవత్సరాలు
శ్రీ మల్లాది శివకుమార్, విజయవాడ – రెండు సంవత్సరాలు
జోశ్యుల కుటుంబం ( కాంత్, శ్రీదేవి, ముకుంద్ ), US – రెండు సంవత్సరాలు
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో
$. 15. ; జీవిత కాలం : భారతదేశంలో ₹. 10,000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
Please Subcribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
****************************************************************************************
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
*********************************************************************************************
**********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…