10_020

.

ప్రస్తావన

మాతృదేవో భవ

పితృదేవో భవ

ఆచార్యదేవో భవ

తల్లి, తండ్రి, గురువు…. ముగ్గురూ దైవంతో సమానం అని పెద్దల పలుకు. ఇందులో నవమాసాలు మోసి తన ప్రాణాలను పణంగా పెట్టి జన్మనిచ్చే కన్న తల్లి ది ప్రధమ స్థానం కాగా, మనకు రక్షకుడుగా ఉంటూ జీవితంలో ఎదుగుదలకు బాటలు వేసే తండ్రిది తర్వాత స్థానం.

‘ అమ్మ ’ అనే మాట ఎంతో కమ్మదైనది అయితే, ‘ నాన్న ’ అనే మాట ఎంతో విలువైనది. అమ్మ జన్మనిస్తే నాన్న మన జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. సమాజంలో మనకి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించడానికి తన సర్వ శక్తులూ ధారపోస్తాడు. పిల్లల ఎదుగుదల కోసం అనుక్షణం తపిస్తాడు. తన కష్టాన్ని కూడా లెక్క చెయ్యడు. తన జీవన గమ్యం ఎలా ఉన్నా పిల్లలకు ఏ కష్టమూ తెలియకూడదని, రాకూడదని తపన పడతాడు. తను ఎన్ని ఇబ్బందులు పడినా, ప్రమాదంలో పడే అవకాశం ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. పిల్లల సుఖం కోసం సంపాదన లో పడి తన ఇష్టాయిష్టాలను కూడా త్యాగం చేస్తాడు. అడుగడుగునా పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ వారు ప్రమాదాల్లోను, ఇబ్బందుల్లోనూ పడకుండా కాపాడుతుంటాడు. తన స్థాయి ఏదైనా తన పిల్లలు తనకంటే పెద్ద స్థాయిలో ఉండాలని అనుక్షణం కోరుకుంటాడు. అందరూ తన పిల్లల్ని పొగుడుతుంటే తనలో తనే మురిసిపోతుంటాడు. ఎవరైనా తన పిల్లల్ని తిట్టినా, చెడ్డగా మాట్లాడినా చాలా బాధ పడిపోతాడు. అది కోపంగా బయిటకు వచ్చినా అందులో అంతర్లీనంగా ప్రేమే ఉంటుంది.

అమ్మ తన ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరుస్తూ ఉంటుంది. కానీ నాన్న అలా కాదు. తన ప్రేమను తన గుండెల్లోనే దాచుకుంటాడు. పైకి గంభీరంగా కనిపిస్తుంటాడు. పిల్లల్ని పొగిడితే ఆయుఃక్షీణం అంటారు కదా ! అందుకే తన ప్రేమ తన పిల్లల పాలిట శాపం కాకూడదనే ఈ ప్రయత్నం.

ఒక మనిషి పుట్టుకలో అమ్మానాన్నల ఇద్దరి పాత్ర ఉన్నట్లే ఎదుగుదలలో కూడా ఇద్దరి పాత్ర ఉంటుంది. జీవితంలో ఇంతటి ప్రధానమైన పాత్ర ఉన్న తల్లిదండ్రులకు ఎంతమంది సరైన విలువ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అందరూ మాత్రం కాదు అనే సమాధానం వస్తుంది. దానికి నిదర్శనమే పెరుగుతున్న వృద్ధాశ్రమాలు. వయో వృద్ధులై అనారోగ్యల బారిన పడిన ఒంటరి తల్లి కో, తండ్రి కో సేవ చేసే ఓపిక, తీరిక లేక తీసుకొచ్చి ఏ రోడ్ ప్రక్కనో, శ్మశానాలలోనో, మరెక్కడో వదిలేసి పోయే ప్రబుద్ధులు ప్రబలుతున్నారు. తన అనుభవిస్తున్న జన్మకు, ఆ జన్మ ఇచ్చిన భోగాలను అందించినది ఈ అమ్మానాన్నలే అనే విషయం మర్చిపోయినట్లు నటిస్తున్నారు. తమ భవిష్యత్తే తమకు ముఖ్యం అనుకొంటున్నారు గానీ భవిష్యత్తులో ‘ ఇదే పరిస్థితి మనకి కూడా ఎదురైతే ? ’ అనే ప్రశ్న వేసుకోవడం లేదు. వేసుకుంటే వచ్చే జవాబే వారి ప్రవర్తనను సరి చెయ్యవచ్చు.

ఈ నెల 20వ తేదీ ‘ అంతర్జాతీయ పితృ దినోత్సవం ’. వృద్ధులైన అమ్మనాన్నలకు రోజూ సేవ చేసుకునే వారికి ప్రత్యేకంగా వారిని గుర్తు చేయనవసరం లేదు. కానీ ఎవరూ లేని అనాధల లాగా వారిని వృద్ధాశ్రమాలకే పరిమితం చేసే వారికి, వారి కర్మకు వారిని వదిలి పెట్టే వారికి తమ బాధ్యతను గుర్తు చెయ్యడానికి ఇలాంటి ఒకరోజు సంవత్సరానికి ఒకసారైనా అవసరమేనేమో ! జీవితంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యత గురించి విస్తృతమైన చర్చ జరుపుకునే సందర్భం కూడా ఇదే అవుతుంది. అది కొందరిలో అయినా మార్పు తెచ్చే అవకాశం ఉంది. ఇది మన సంస్కృతి కాదని వదిలేసే బదులు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతగా మెలిగే వారు బాధ్యతా రహితంగా మెలిగే వారికి కనువిప్పు కలిగించే కార్యక్రమాలు ఈరోజు చేపడితే కొంతైనా ప్రయోజనం ఉండవచ్చు.

తల్లీ, తండ్రీ ఎవరికైనా తల్లిదండ్రులే ! భర్త తల్లిదండ్రులకు నేనెందుకు సేవ చెయ్యాలి అని భార్య, భార్య తల్లిదండ్రుల బాధ్యత నాకేం సంబంధం అని భర్త అనుకోకుండా ఎవరికి అవసరం వచ్చినా ఇద్దరూ భాగం పంచుకుంటూ తమ తల్లిదండ్రుల శేషజీవితాన్ని ఆనందమయం చేయవలసిన అవసరం ఉంది. 

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి      

.

***********************************************************************************************************

 మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

************************************************************************************************

.

 కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

.

Please Subscribe & Support

.

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

.

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

.

.

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

.

*********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో