11_015AV పలుకు తేనెల తల్లి – అన్నమాచార్య

పలుకు దేనెల తల్లి పవళించెను |
కలికి తనముల విభుని గలసినది గాన ||

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను |
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన ||

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను |
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన ||

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను |
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన ||

 

👉🏾 ఈ సంచిక చదివి మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾