13_003 వార్తావళి

 

తెలుగింటి అత్తగారు 

ప్రత్యేక సంచికావిష్కరణ సభ, డాక్యుమెంటరీ ప్రదర్శనలకు ఆహ్వానం

నమస్కారం!

నా పేరు అనంత పద్మనాభమూర్తి. వెనకటి తరం మహానటి శ్రీమతి సూర్యకాంతం గారి అబ్బాయిని. అమ్మ పుట్టినరోజు అక్టోబర్ 28. అయితే, ఈ అక్టోబర్ 28కి ఒక ప్రత్యేకత ఉంది. ఆరోజు అమ్మ శత జయంతి ప్రారంభం అవుతుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ 5 సాయంత్రం “తెలుగింటి అత్తగారు” అనే ప్రత్యేక సంచిక విడుదల చేస్తున్నాను. చెన్నైలోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రాంగణంలోని గోదావరి హాలులో కార్యక్రమం జరుగుతుంది. No..22..విజయ రాఘవా రోడ్ లో సాయంత్రం 6 గంటలకి మొదలవుతుంది.

మీరంతా తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి, తరువాత జరిగే విందులో పాల్గొనాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను.

Dr. అనంత పద్మనాభ మూర్తి,
F.3, సూర్యకాంత రెసిడెన్సీ,
No. 26, సెకండ్ మెయిన్ రోడ్,
సి. ఐ. టీ. కాలనీ, మైలాపుర్, చెన్నై..600004
dapmurthy@gmail.com; Cell : 9282113599

********************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page