10_008 ద్విభాషితాలు – చలి కానుక

లోకం చలిముసుగుతన్ని…

ముడుచుకుని పడుకున్నవేళ…

చీకటితోనే లేచి…

చిక్కటి…వేడి కాఫీని …

సహచరిణితో కలిసి సేవిస్తే…

చలిరోజును…

అనుబంధం పెనవేసుకుంటుంది.

చలితెరల్ని తొలగించుకొంటూ…

ఊరివెలుపల వెలుగులోకి…

ఉదయపు అడుగుల్ని నడిపిస్తే…

హేమంత సౌందర్యం…

మనసును ఆవరిస్తుంది.

చలిమంట చెంత చేరి…

వెచ్చటి కబుర్లు పంచుకుంటే..

ఘడియొక క్షణమై…

హత్తుకుంటుంది.

చలి రాత్రి…నిద్రపట్టక…

గుండెలదాకా దుప్పటిని బిగించి….

తలపులో ములిగితే…

చలి …కవితవుతుంది!

**********************************************