10_006 అట్లతద్ది – నరకాసుర వధ

 

 

ఆశ్వయుజ బహులా తదియ రోజున ముఖ్యంగా ఆడపిల్లలు జరుపుకునే నోము ‘ అట్లతద్ది ’. ఇది ఉత్తర భారతదేశంలో కూడా చేసుకుంటారు. దీనిని రెండు రకాలుగా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాలలో సాయింత్రం జరుపుకుంటారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయింత్రం పూజలు చేసి అట్లు ఫలహారంగా తీసుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో తెల్లవారుఝామున జరుపుకుంటారు. తెల్లవారుఝామున లేచి ఆటలాడుకోవడం, పూజలు చేసి అట్లు ఫలహారం చెయ్యడం వంటివి చేస్తారు.  ఏ సమయంలో జరుపుకున్నా చంద్రుడిని పూజించడం ఇందులోని విశేషం. దీనిని ‘ చంద్రోదయ గౌరీ వ్రతము ’ అని కూడా పిలుస్తారు.

ఈ నోము ప్రసిద్ధం కావడం వెనుక ఒక కథ ఉంది.

ఆ కథ ఏమిటో…. ఆ విశేషాలేమిటో తెలియజేస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. ఈ క్రింది వీడియోలో……   

**********************************

 

నరకాసురుడు అనే రాక్షస సంహారం జరిగిన సందర్భంగా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ముందురోజు నరకాసురుని వధ జరిగింది గనుక ఆరోజును నరక చతుర్దశి అని వ్యవహరిస్తారు.  కొన్ని చోట్ల ‘ రావణ వధ ’ ఆరోజే జరిగిందని చెబుతారు. ఈ రెండింటిలో ఏది జరిగినా…. మరణించినవాడు నరకుడైనా, రావణుడైనా… ఆరోజు జరిగింది దుష్టత్వము, దుర్మార్గము వంటి వాటి నిర్మూలనే !

నిజానికి రాక్షసులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. వీరు కూడా కశ్యప మహర్షికి దేవతలతో బాటు జన్మించిన వారే ! కశ్యపునికి దితి వలన జన్మించిన వారు దేవతలు, దనువు వలన జన్మించిన వారు దానవులు. వీరందరూ సోదరులే ! మరి వీరు రాక్షసులుగా ఎందుకు పరిగణింపబడుతున్నారు ?

ఇటువంటి విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. ఈ క్రింది వీడియోలో……