10_020 బాలభారతం – గాలిపటం

.

అదిగో ! అదిగో ! గాలిపటం !

ఆకాశంలో గాలిపటం !

రంగురంగులగాలిపటం !

చెంగున ఎగిరేగాలిపటం !

.

                        గాలివాలు చూసుకు కదలాడే

                        కీ లెఱిగిన దీగాలిపటం !

                        క్షణాని కొక్కొక్కప్రక్కకు మొగ్గే

                        గుణ మున్నది యీమొండిఘటం !

.

కోతికివలెనే తోక వున్నది !

కోతివలెనే యిది నిలకడ లేనిది !

అన్నిరంగులగాలిపటానికి

అసలురం గిదే చూడండీ !

.

                        ఒకదారప్రో వూత గొని

                        చకచక పై పై కెగిరింది !

                        ఆ దారము తెగిపోతే దానికి

                        ఆధారము మఱి లేదండీ !

.

పరులమీద ఆధారపడి

బ్రతికే వారలగతి యింతే !

స్వశక్తితోనే పైకి రాగలుగు

వాడే నిజముగ మని షంటే !

.

                        నీతీ నియమం లేనివారి నీ

                        గాలిపటంతో పోలుస్తారు !

                        కాలము వృధాగా గడిపేవానిని

                        గాలిపటంతో పోలుస్తారు !

.

*******************************

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

******************************************************