11_013AV ఇన్ని చదువనేల…

 

ప|| ఇన్నిచదువనేల ఇంత వెదకనేల | కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||

 

చ|| వలెననేదొకమాట వలదనేదొక మాట | సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను |

వలెనంటె బంధము వలదంటె మోక్షము | తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే ||

 

చ|| పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను |

పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||

 

చ|| పరమనేదొకటే ప్రపంచమొకటే | సిరుల నీరెంటికిని జీవుడే గురియౌను |

ఇరవు వేంకటేశుడిహ పరములకర్త | శరణాగతులకెల్ల సతమీతడొకడే ||

 

విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో ‘ బి – హై ‘  గ్రేడ్ కళాకారిణి నీరజ విష్ణుభట్ల పాడిన

వకుళాభరణ రాగం, ఖండచాపు తాళంలోని అన్నమాచార్య కీర్తన…. 

 

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾