12_002Av

.

ప్రస్తావన

.

సంగీతం సార్వజనీనం. భాష, ప్రాంతం వంటి వాటికి అతీతమైనది. సంగీతంలో ఎన్నో రకాల సంప్రదాయాలు ఉన్నప్పటికీ సాహిత్యం అర్థమైనా, కాకపోయినా అందరూ విని ఆనందించగలిగే మహత్తు సంగీతం స్వంతం.

భారత దేశంలో ప్రధానంగా రెండు రకాల సంప్రదాయాలున్నాయి. ఉత్తరభారతదేశంలో హిందూస్థానీ, దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీత సంప్రదాయాలు విలసిల్లుతున్నాయి. ఇవికాక శాస్త్రీయ సంగీతాన్ని సరళతరం చేసిన లలిత సంగీతం దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా తెలుగునాట ప్రసిద్ధి చెందింది. ఉత్తర భారతంలో ‘ సుగం సంగీత్ ’ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. శాస్త్రీయ సంగీత ఛాయలు పైకి కనబడకున్నా జానపదులు పాడుకునే పాటలను ‘ జానపద సంగీతం ’ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇందులో కూడా సహజంగానే శృతి, లయ ఉంటాయి. ప్రకృతి నుంచి వీటిని జానపదులు నేర్చుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతిలోని అన్ని అంశాలలోనూ శృతి, లయ ఉంటాయి. పక్షుల కిలకిలారావాలలో, సెలయేటి గలగల లలో, చివరికి గాలికి ఊగే చెట్లలో కూడా ఒక రకమైన శృతి, లయ ఉంటాయి. అందుకే స్వరకర్తలు ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ ఉంటారు.

కొంతకాలం క్రితం తెలుగునాట లలిత సంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. అనేకమంది కవులు గీతాలను రచిస్తే, నిష్ణాతులైన స్వరకర్తలు స్వరాలు సమకూరిస్తే, ఎంతోమంది గాయనీ గాయకులు తమ గళంలో వాటిని వినిపించి శ్రోతలనీ తన్మయులని చేసేవారు. అప్పట్లో దీనికి ప్రధానమైన వేదిక ఆకాశవాణి. ఎందరో స్వరకర్తలని, గాయకులను అందించింది. సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, సుశీల, వసంత వంటి లబ్ద ప్రతిష్టులైన గాయకులు తొలిరోజుల్లో ఆకాశవాణి లో లలిత గీతాలు పాడిన వారే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎన్‌సి‌వి జగన్నాధాచార్యులు వంటి ప్రముఖ శాస్త్రీయ సంగీతజ్ఞులు కూడా కొన్ని లలిత గీతాలు ఆలపించేవారు. చిత్తరంజన్, మోహన్రాజు, మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వేదవతి ప్రభాకర్ వంటి వారు విరివిగా ఆకాశవాణి లో లలిత గీతాలు పాడేవారు. వీరి స్ఫూర్తిగా అనేకమంది ఔత్సాహికులు కూడా లలిత గీతాలు నేర్చుకునేవారు. అటు రచయిత గాను, స్వరకర్త గాను రాణించిన వారిలో బాలాంత్రపు రజనీకాంతరావు గారు చెప్పుకోదగ్గవారు. అలాగే గాయకుని గాను, స్వరకర్త గాను రాణించిన వారిలో చిత్తరంజన్ ప్రథములని చెప్పవచ్చు.

ఇటీవల లలిత సంగీత చక్రవర్తి గా పిలుచుకునే డా. మహాభాష్యం చిత్తరంజన్ గారు 85వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డా. ఎన్‌టి రామారావు కళా మందిరంలో కనకాభిషేకం, ఆయన జీవిత ఔన్నత్య శిఖరం పై తయారయిన ‘ నాద తనుమ్ అనిశం – చిత్తరంజనం ’ అనే గ్రంథావిష్కరణ వైభవంగా జరిగాయి. దానికి ఆయన శిష్యులతో పాటు లలిత సంగీత ప్రపంచం యావత్తు తరలివచ్చింది. ( ఆ వివరాలు కార్యక్రమ వీడియో తో సహా ‘ ఆనందవిహరి ’ లో ఉన్నాయి. )

ఇటీవలి కాలంలో లలిత సంగీతానికి ఆదరణ తగ్గిందనే చెప్పవచ్చు. దానికి కారణం ప్రధానంగా ఆకాశవాణి వినేవారు తగ్గిపోతున్నారు. రేడియో లో కూడా వ్యాపార ధోరణి పెరిగిపోవడం, ఈ రంగంలోకి వ్యాపార సంస్థలు ప్రవేశించడం, అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమా పాటలకే ప్రాధాన్యం ఇవ్వడం వంటివి కొన్ని కారణాలు. హాయిగా, మధురంగా సాగే లలిత గీతాలు వింటూ సేద తీరే పరిస్తితి ఇప్పుడు కనిపించడం లేదు. పాతతరం వారిలోనే కొంతవరకు ఇప్పటికి కూడా లలిత గీతాల శ్రావ్యతను అనుభూతి చెందే ఆసక్తి కనిపిస్తోంది. దాన్ని నేటి యువతకు కూడా పరిచయం చేస్తే  ఆర్కెస్ట్రా హోరు నుంచి తప్పించి సాహిత్యంలోని అందాన్ని, గాయకుల గళంలోని మాధుర్యాన్ని, సంగీతంలోని గొప్పదనాన్ని ఆస్వాదిస్తారు.     

.

******************************************************************************************

.

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ