Rao

13_009 గురుపూర్ణిమ

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటే ఏమిటి ? ఆషాఢ శుద్ధ పౌర్ణమికి గురు పూర్ణిమ అనే పేరు ఎలా వచ్చింది ? వ్యాస మహర్షి పేరు మీద వ్యాస పూర్ణిమ అని పిలవడానికి కారణాలు ఏమిటి ? అసలు వ్యాస మహర్షి జననం, ఆయన జీవిత విశేషాల గురించి గురుపూర్ణిమ సందర్భంగా డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ

13_008 ఉగాది – శ్రీరామనవమి

ఉగాది అంటే ఏమిటి ? ఉగాది రోజున తప్పనిసరిగా చేసే ‘ ఉగాది పచ్చడి ‘ విశిష్టత ఏమిటి ? ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెయ్యడం సాంప్రదాయం. ఈ పంచాంగ శ్రవణం అంటే ఏమిటి ? అందులో ఉండే అంశాలు ఏమిటి ? వాటి విశేషాలు ఏమిటి ? ….. వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు… శ్రీరాముని గురించిన విశేషాలు, ఆయన పుట్టుక, ఆయన వ్యక్తిత్వ విశేషాలను వివరిస్తూ సీతారామ కల్యాణ విశేషాలతో బాటు శ్రీరామనవమి విశిష్టత, దానితోబాటు వచ్చే వసంత నవరాత్రుల విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.

13_007 సాక్షాత్కారము 10

కట్టియలపైకి చేరినకాయ మరరె!
కట్టియలతోడ తానును కాలిపోవు!
కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;
మంట పెట్టుటకై నను బనికివచ్చు!

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.

13_006 సాక్షాత్కారము 09

ఎన్నో బెజ్జము లున్న తనువులో
గాలి నిలుచుటే ఆశ్చర్యం!
గాలిబ్రతుకు లివి రాలిపోవడం.
కానేకా దిది ఆశ్చర్యం!!

13_006 మాఘం

మౌని అమావాస్య తర్వాత ప్రవేశించిన మాఘమాసం చాలా ప్రత్యేకతలు కలిగి వుంటుంది. శారీరిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే సముద్ర స్నానాలు, సూర్యదేవునికి పూజలు ఈ మాసం ప్రత్యేకత. మాఘపూర్ణిమ రోజున తప్పనిసరిగా చాలామంది సముద్ర స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఈ మాఘమాసంలో స్నానాల ప్రత్యేకతలు, విశేషాలు వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు…..