11_020 బాలభారతి – మణిమాల

 

ఆ. వె.     మాతృభాషయందుమాతృదేశమునందు

            మాతృదేవియందు మమత లేని

            వాడు పుటెనేని భారమ్ము భూమికి !

            కలిగి వాడు తల్లికడుపుచేటు !

 

తే. గీ.     నోరు మంచిది యైననూ డూరు మంచి !

            నోరు మంచిది కాకున్న దూరు పొరయు !

            కోయి లెవ్వరినెత్తిపై ఱాయి పెట్టి ?

            కాకి యెవ్వరి కేయుపకార మెంచె ?

 

తే. గీ.     వ్యక్తిగత మైనస్పర్థలు ప్రబలెనేని

            జాతి కంతకు నాశమ్ము సంభవించు !

            చెట్టు చెట్టును రాపాడ చిచ్చు పుట్టి

            అడవి యంతయు దగ్థ మౌ టబ్బురమ్మే ?

 

ఆ. వె.     అడప తడప ఎన్నొ అగ్నిపరీక్షలు

            సత్ప్రవర్తనులకె సంఘటిల్లు !

            అరిగిపోవుబాధ హరిచందనమునకే !

            కాల్పు సుత్తిపోటు కనకమునకె  !   

   

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾