11_013AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 06

నాయికా నాయక భావం తో రంగస్థలం మీద సాగే నృత్య సంగీత సంయోగం నాట్యం. నాయికా నాయకుల శృంగార నాట్య సంయోగం రసానుభూతిని కలిగిస్తుంది. అన్నమాచార్య పరమ మనోహరం గా ఈ అంశాన్ని తన సంకీర్తనలతో ఆవిష్కరించాడు. 

కేవలం గానం చేత, భావన చేత, నాట్యం చేత భావుకులకి, శ్రోతలకి, ప్రేక్షకులకి రసానందం సిద్ధిస్తుంది.

క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దినాటి – భరతముని నాట్య శాస్త్రం లోను 1005 – 1056 – భోజ దేవుని శృంగార ప్రకాశంలోను 1175 – 1250 నాటి – శారదాతనయుని భావ ప్రకాశంలోనూ 1450 – 1500 నాటి భాన దత్తుని రసమంజరి లోనూ – చెప్పిన రస సిద్ధాంత విశేష విషయాలనెన్నింటినో తన సంకీర్తనలతో ప్రకటన చేసిన వైనం కళల స్థాయిని పెంచింది. 

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾