11_001

.

ప్రస్తావన

‘ శిరాకదంబం ’ ప్రస్థానం లో దశాబ్ద కాలం పూర్తి అయింది. పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్న రచయితలు, రచయిత్రులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనదారులకు, ఇంకా అనేక రూపాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న …. అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ….

2011 లో ప్రారంభించిన ఈ పత్రిక తొలిసారి అంతర్జాలంలో ఉగాదికి శ్రవ్య కవి సమ్మేళనం విజయవంతంగా నిర్వహించింది. అలాగే మాతృ దినోత్సవం, మహిళా దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ, వార్షికోత్సవం వంటి సందర్భాల్లోనూ ప్రాముఖ్యమున్న అంశాల పైన ప్రత్యేక సంచికలు రూపొందించింది. తెలుగు రాష్ట్రాలలోని ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం కథా రచన పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ‘ బాలకదంబం ’ పేరుతో కథలు, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం వంటి విషయాలలో బాలల ప్రావీణ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. సమాజంలో వివిధ రంగాలలో ప్రముఖులైన వ్యక్తుల అంతరంగ కథనాలు అందించడం జరిగింది. అనేక ఆథ్యాత్మికాంశాలను, పురాణ అంశాల నుంచి ఎందరో పాత తరం రచయితల రచనలతో బాటు నవతరం రచయితలను పరిచయం చెయ్యడం కూడా జరిగింది. సోదర సంస్థ ‘ శిరావేదిక ’, అమెరికాలోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సహకారంతో విశాఖపట్నం లోని పాఠశాలల విద్యార్థులకు ‘ భాగవత పద్యాల పోటీలు ’ నిర్వహించడం మరో మైలు రాయి. అలాగే వీధి పిల్లలకోసం విశాఖపట్నం లో పోలీసులు, పౌరులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ పాపా హోం ’ పిల్లలకు శిరావేదిక, సప్నా, అంతర్ముఖ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రలేఖనం, నవ్య రీతిలో కథా రచన పోటీలు నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా faces స్వచ్ఛంద సంస్థ సహకారంతో వరంగల్ లోనూ, తమ తల్లిదండ్రుల స్మారకార్థం శ్రీ జి‌ బి ‌వి శాస్త్రి గారి సౌజన్యంతో అమలాపురం లోనూ ‘ దేశభక్తి గేయాల ’ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇలా ఈ పది సంవత్సరాలలో క్రమం తప్పకుండా ( అనివార్య కారణాల వలన మధ్యలో కొన్నిసార్లు ఆటంకం ఏర్పడినా ) సంచికలు తీసుకురావడంతో బాటు ప్రత్యేక సంచికలను రూపొందించడం, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం వంటివి ఎన్నో చెయ్యడం జరిగింది. వీటి విజయానికి దోహదపడిన వారిలో మా సంపాదక వర్గ సభ్యులతో బాటు ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. వారందరికీ వేనవేల ప్రణామాలు.

కొత్త దశాబ్దంలో అడుగుపెట్టాం. ఈ ప్రయాణం ఇంతటితో ఆగదు. మరింత ముందుకు వెడుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కొన్ని క్రొత్త ప్రయోగాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. అందులో ప్రధానంగా ఇప్పటి బాలల్లో, యువతలో మన తెలుగు భాష పట్ల తగ్గుతున్న ఆదరణను తిరిగి సాధించడానికి వారికి మన పద్య సంపదను, సాంస్కృతిక, సాహితీ వైభవాన్ని చవి చూపించడానికి, వాటిలో వారికి ప్రవేశం కల్పించడానికి శతక పద్యాల పోటీలు, మన సాంస్కృతిక, సాహితీ సంపదపై ప్రశ్నావళి వంటి పోటీలు, రచయిత / రచయిత్రుల కోసం కథా, నవలా రచన పోటీలు వంటివి ఎన్నో నిర్వహించాలనే సంకల్పం ఉంది. త్వరలో ఒక్కొక్కటిగా అవి తుది రూపు దిద్దుకుని మీ ముందుకు రాబోతున్నాయి. వీటన్నిటికీ మీ అందరి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయని…. ఉండాలని ఆశిస్తున్నాము.

ఈ సంచిక అక్షర రూపం లోనే కాకుండా విడిగా దృశ్య శ్రవణ ( Audio Visual ) అంశాలతో మరో ప్రత్యేక ( అనుబంధ ) సంచిక గా రూపొందించడం జరిగింది. వచ్చే సంచిక నుంచి ప్రతి నెలా ఒక సంచిక అక్షర రూపం లోను, మరో సంచిక దృశ్య శ్రవణ రూపంలోను వెలువడుతాయి. పాఠకులు గమనించ ప్రార్థన. పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా మనవి.

మరోసారి…. ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు.         

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

.

******************************************************************************************

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

******************************************************************************************

.

 కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

.

Please Subscribe & Support

.

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

.

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

.

.

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

.

******************************************************************************************

.

*********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో