.
ఎలకోయిల నలు పైనా
కలకంఠమె చూస్తాము ;
కొంగ లెంత తెలుపైనా
గొప్పవి అనుకొంటామా ?
.
రాముడు నలుపే !
కృష్ణుడు నలుపే !
యమునానది నలుపే !
రత్నరాశులను
కడుపున దాల్చిన
కడలిరాజు నలుపే !
.
ఒడలు చీల్చుప్రజ
కడుపులు నింపే
పుడమితల్లి నలుపు !
ధరణికి జీవన
దానము చేసే
మబ్బులదొర నలుపు !
.
నల్లనికనుపాపలలో
ౘల్లనివెలుగులు లేవా ?
నల్లనిఆకాశంలో
తెల్లనిపువ్వులు లేవా ?
.
మనుషు లెంత నలుపైనా
మనసే చూడాలి !
కులం మతం ఏదైనా
గుణమే చూడాలి !
.
—— ( 0 ) ——
.