రాగాలకు సులభ సూచికలు – రాగ లక్షణ గీతికలు
రచన, సంగీతం :
కాళీపట్నం సీతా వసంత లక్ష్మి
మాములుగా రాగాల పేర్లు చెబితే, అందులో ఉన్న ముఖ్య రచనలు చెప్పగలగడం సంగీత విద్యార్హులకు ఒక చిన్న తరహా పరీక్షలా ఉంటుంది.
ఆయా ముఖ్య రాగాలలో గల రచనలతో బాటు, ఆ రాగపు లక్షణాలను, ముఖ్య ప్రయోగాలను ఒక కెమిస్ట్రీ ఫార్ములా తరహాలో చిన్న చిన్న
రచనలుగా చేసి, సంగీత విద్యార్థులకు నేర్పటం ఆరంభించాను. ఇవి పిల్లలకు, పెద్దలకూ కూడా ఎంతగానో నచ్చటమే కాక, ఆ రాగాలను గురించి
చిరు గుళికల వలె గుర్తుంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా ఒక పది రాగాలకు ఈ గీతికలు వ్రాయటం జరిగింది.
దాని స్ఫూర్తి తో, వీటికి మరింత ప్రాచుర్యం అందచేయాలనే ఆశతో ఇవి మీ ముందు ఉంచుతున్నాను. హిందుస్తానీ సంగీతం లో ఈ విధంగా అనేక రచనలున్నాయి. మనకు లేవు. అందుకే ప్రయత్నించాను. ఈ సారి హంసధ్వని రాగం, గణేశ వందనం, అందులో ఉన్న అతి ముఖ్య రచన అయిన “వాతాపి గణపతిం భజేహం” ని పేర్కొంటూ.
రాగలక్షణ గీతిక – హంసధ్వని
రచన, సంగీతం: “సుర్ మణి ” కాళీపట్నం సీతా వసంత లక్ష్మి
పాడిన శిష్యులు :
అరుణ వెంకట్రామన్, ఆరుషి హండా, నమ్రత కుమార్, ప్రీతి బాలాజీ, సుధా నటరాజన్, విద్య బాలాజీ
హంసధ్వని రాగం – ఆది తాళం
స్వరం :
స ని ప , ని ప గ , ప గ రి , గ రి స ,| ని స రి గ స రి గ ప | ని ప గ ప ని ని స్ ,|| – 2
, స స స స ని రి స ని ప , | , గ రి గ ప | గ గ రి స ||
జ య జ య గి రి జా | , బా లగ | జా నన ||
, గ గ రి గ ప ప ప ప | గ ప ని ని | స స స స ||
, జ య శి వ శం క ర | పా ర్వ తి | నం దన ||
స్వరం : 2
, ని ప ని స రి రి రి రి | , ని రి గ రి | స స స స ||
, వి ఘ్న వి నా శ క | , వి జ య గ | జా న న ||
, గ గ గ రి గ గ గ గ | రి రి స స నిస రి రి రి ||
, శ ర వ ణ సే వి త | సుము ఖ గ జా న న ||
, ప ప గ రి స స నిప, నిసరి, | , సరిసని పప పగ నిప గ రి స, ||
, త వ పా ద శ ర ణం | శ ర గ ణం జా న న || స్వరం||
గ గ గ రి రి రి స ని | ప రిరి రిరి || గ గ ప ప స ని ని ని ని ||
వా తా పి గ ణ | ప తీ || హం స ధ్వ నీ
గ ప ని సరిగ గ రి స ని ప గరిసని | ప రిరి రిరి || గ గ ప ప స ని ని ని ని ||
వా తా పి గ ణ | ప తీ || హం స ధ్వ నీ ||
ని స గ రి సనిపప గ రి గ ప గరిసరి సనిపప గరి గపనిసరిరి ||
మో ద క ప్రి య ము ద మం గ ళ రా గం ||
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
–—– ( 0 ) ——-
Please visit this page