10_011 ద్విభాషితాలు – ‘కల’వరింత

.

నిన్న  రాత్రి..

నువ్వు దిగి వచ్చి..

చెరిగిపోయిన వసంతాల్ని..

తిరిగి దిద్దావు.

.

నేను… 

రాలిపోయిన నవ్వుల్ని.. . ఏరుకున్నాను.

.

మనని..

మెలకువ లోకి …  మోసుకొద్దామనుకున్నాను.

.

ముసుగు తొలగించుకున్న వెలుగు..

మళ్ళీ చీకటిగా మారింది !

.

********************************