10_022

Please visit this page

.

ప్రస్తావన

.

ఈ సంచికతో ‘ శిరాకదంబం ’ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఆ సందర్భంగా రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాల పత్రికా రంగంలోనే క్రొత్త ప్రయోగ రూపకల్పన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాల పత్రికా పాఠకులకు క్రొత్త అనుభవాన్ని ఇవ్వాలనే ఈ ప్రయత్నం. దశాబ్ద కాలంగా తీసుకు వస్తున్న మార్పులన్నీ పాఠకుల అదరిస్తూనే ఉన్నారు. అందుకే ఈ ప్రస్థానం ఆగకుండా సాగుతోంది. అయితే కరోనా తర్వాత పత్రికా రంగంలో లాగే సాంస్కృతిక రంగంలోను చాలా మార్పులు వచ్చాయి. దానికి సాంకేతిక అభివృద్ధి చాలా సహకరించింది. సాంస్కృతిక కార్యక్రమాల వేదిక అంతర్జాలానికి మారింది. ఇప్పుడు దాదాపుగా సంగీత సభలు, సమావేశాలన్నీ అంతర్జాలంలోనే జరుగుతున్నాయి. అయితే ప్రదర్శన కళలైన నృత్యం, నాటకం వంటి వాటి అవసరాలను మాత్రం అంతర్జాల వేదిక పూర్తిగా తీర్చలేకపోతోంది. ఇప్పటికే ఉన్న టీవీ చానల్స్ గాని, ఇటీవల బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన ఓ‌టి‌టి ప్లాట్‌ఫాం గాని ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని ఆయా కళాకారులకు స్థానం కల్పించి ప్రోత్సహిస్తే మన సంస్కృతికి తమ వంతు సేవ చేసినవారవుతారు.

గతంలో కవులను, కళాకారులను రాజులు ప్రోత్సహించేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు, సాంస్కృతిక సంస్థల ద్వారా కొందరు కళాభిమానులు, రేడియో టీవీ వంటి మీడియా సంస్థలు, ఇప్పుడు అంతర్జాలంలో కొన్ని వేదికలు కళా పోషకులు. అయితే రేడియో, టీవీ రంగాలలో వ్యాపార ధోరణి పెరిగి మనవైన సంప్రదాయ కళలను దూరం చేసాయనే చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలోని మీడియా సంస్థలు కొంతవరకు మెరుగు. ఏమైనా దక్షిణాదిన మిగిలిన భాషల వారితో పోలిస్తే మన తెలుగు భాషను, మనవైన సంప్రదాయ కళలను మనవారే వ్యాపారం పేరుతో నిర్లక్ష్యం చెయ్యడం గర్హనీయమైన విషయం. ఇతర భాషల వారికి అడ్డురాని ఈ వ్యాపార ధోరణి మనకే ఎందుకు అడ్డు వస్తోందో తెలియదు. ఈ కారణంగా మనవైన సాంప్రదాయ కళలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా కాకుండా వాటికి కూడా సముచిత స్థానం కల్పిస్తే మనదైన సంస్కృతిని పరిరక్షించిన వారవుతారు. కళాకారులకు చేయూత నిచ్చిన వారవుతారు. లేదంటే కొంతకాలానికి తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా తమదైన గుర్తింపు లేకుండా పోతుంది.

.        

ఒక పత్రిక… అది ప్రింట్ పత్రిక కావచ్చు, అంతర్జాల పత్రిక కావచ్చు…. ఏదైనా నిర్వహణలో ఒక దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టానష్టాలను, అడ్డంకులను దాటుకుని ప్రయాణం చెయ్యాలి. ‘ శిరాకదంబం ’ నిర్వహణలో కూడా ఇవన్నీ ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుని ఇంతదూరం వచ్చింది. ఇంకా ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచన ఉన్నా ఆర్థికపరమైన సమస్యలు అడ్డు వస్తున్నాయి. అవి అధిగమించడానికి ఇటీవలే చందా పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. కొంతమంది శ్రేయోభిలాషులు వెంటనే స్పందించారు. కొంతవరకు అది ఉపకరించినా ఇంకా పూర్తి వేగం పుంజుకోలేదు. రాబోయే రోజుల్లో మరింత క్రొత్తదనంతో క్రొత్త రచయితలను, మంచి రచనలను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలనే ఆలోచన ఉంది. సహృదయులైన పాఠకుల అండదండలుంటే అది అసాధ్యమేమీ కాదు. ‘ శిరాకదంబం ’ పత్రికకు తాము చందా కట్టడమే కాదు… తమ సన్నిహితులకు కూడా పరిచయం చేసి వారిని కూడా చందాదారులుగా చెయ్యడం ద్వారా సహాయపడవచ్చును. పత్రిక లో కనిపించే గూగుల్ ప్రకటనల పైన క్లిక్ చెయ్యడం ద్వారా కూడా కొంతమేర సహాయపడవచ్చు. అలాగే అమెజాన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసే వారికోసం అమెజాన్ వారి వస్తువుల ప్రకటనలలో అవసరమైన వాటిని ఎంచుకుని ఆర్డర్ చెయ్యడం ద్వారా కూడా పత్రికకు సహాయపడవచ్చు. అంతేకాకుండా అమెజాన్ పేజీ లింక్ కూడా ఇవ్వబడింది. అందులో  కూడా ఎంచుకోవచ్చు. అలాగే ఆయా సందర్భాల్లో శుభాకాంక్షల ప్రకటనల వంటివి కూడా ఇవ్వవచ్చు. వ్యాపార రంగంలోని పాఠకులు తమ వాణిజ్య ప్రకటనలను కూడా ఇవ్వవచ్చు.   

.   

**************************************************************************************************************************************************************

కరోనా మరోసారి విజృంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

***************************************************************************************************************************************************************

.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

 

******************************************************************************************

.

 కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

 

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

.

Please Subscribe & Support

.

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

.

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

.

.

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

.

******************************************************************************************

.

*********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో