12_008 సునాదసుధ – నగుమోము గనలేని

“ సునాద సుధ” కచేరీ – 2023 పిబ్రవరి నెల సంగీత ప్రదర్శన :

“ సునాద సుధ” అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ అనే ఒక చిన్న ప్రాంతంలో 1981 లో మొదలై దాదాపు నాలుగు దశాబ్దాలుగా నాద వైభవంతో వెలుగుతున్న భారతీయ శాస్త్రీయ సంగీత వాగ్గేయ కారుల తైలవర్ణ చిత్ర శాల. శారదాపూర్ణ, డా. శొంఠి శ్రీరామ్ స్థాపించిన సంగీత కుటీరం “ సునాద సుధ”.

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మంగళంపల్లి, నేదునూరి, నూకల, శశాంక, మాండలిన్ శ్రీనివాస్, విశ్వమోహన్ భట్, ఈమని, చిట్టిబాబు, ఉమయాళ్ పురం, అక్కినేని, నందమూరి, దాసరి, విశ్వనాథ, అడయార్, వెంపటి, మాడుగుల, LS, మల్లాది, PVRK, మొదలుగా ఎందరెందరో మహనీయులు కళా వైదుష్య కాంతులు అక్షతలుగా అందించిన సంగీత కుటీరం. పరమహంస పరివ్రాజికాచార్య శ్రీ సిద్ధేశ్వరానంద మహా స్వామివారు, శ్రీ సద్గురు శివానంద మూర్తి మహా స్వాముల ఆశీస్సుల బలంతో విద్యార్ధులకి, కళాకారులకీ, సాధకులకీ, నాదోపాసకులకీ, రసిక జనావళికి, విదేశ సంగీతజ్ఞులకీ ఇరవైన గానసాధనా కేంద్రం. ఇప్పటికి 800 మించి ప్రదర్శనలు సాగాయి. తైలవర్ణ చిత్రాల నందించిన ప్రసిద్ధ భారతీయ చిత్రకారులు అందరూ చిరస్మరణీయులు.

2023 ఫిబ్రవరి నెల విశిష్టం. బర్కిలీ స్కూల్ సంగీత విశ్వవిద్యాలయంలో పాశ్చాత్య శాస్రీయ సంగీతంతో పాటు భారతీయ కర్ణాటక సంగీత బాణీ లో ప్రతిభ పొందిన “ జో రూఎన్ “, హిందూస్తానీ తబలా వాద్యంలో పేరు పొందిన “ ధనంజయ్ కుంటే “ ప్రదర్శన అద్భుతంగా సాగింది. విదేశీ విశిష్ట వ్యక్తులు, ప్రేక్షకులు, సంగీతజ్ఞుల మన్నన పొందిన సంగీత సభ.

‘ నగుమోము గనలేని ‘ అభేరి రాగం, అది తాళం, త్యాగరాజ కీర్తన.

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Please visit this page