10_021 ద్విభాషితాలు – సాధన

.

క్షణంలో పుట్టి…

అరక్షణంలో వీగిపోతున్న…

ప్రేమకు కాలమిది.

అవసరమే బంధంగా మారి.. మనుషులు యంత్రాలుగా.. బ్రతుకుతున్న లోకమిది.

.

ప్రేమ ఓ మహా సాధన!

.

పంజరం లో చిక్కుకున్న….

పక్షి కళ్ళలోకి చూడు.

పాల కోసం ఏడుస్తున్న…

పిల్లి కూనను చేతుల్లోకి తీసుకో.

రాయి దెబ్బతిన్న…

కుక్క పిల్లను పలకరించు.

.

మనుషుల్లో కృశించి పోతున్న

మానవతను బ్రతికించాలంటే..

ఓ మూగజీవిని ప్రేమించడం

నేర్చుకో !

ఇవ్వడమే తెలిసున్న ఆ ప్రేమ…

సాధనగా…

అలవాటుగా…

స్వభావంగా మారి…

నీలో పెరిగి..పెరిగి..అనంతమై..

సాటి మనిషిని….

నిస్వార్ధంగా ప్రేమించగలిగే…. జీవనసూత్రంగా మారుతుంది!

.

—–(0)—–