11_018 బాలభారతి – మహాపురుషులు 11_018&019AV June 1, 2022 రాముడు ఉన్నాడు !గుణాభిరాముడు ఉన్నాడు !తండ్రిమాట నిలబెట్టుటె తనయులధర్మం అన్నాడుఆశయసిద్ధికి రాజ్యము విడిచిఅడవికి పోయాడు !ఇల్లాలిని విడిచాడు ! ? సత్యముకోసం హరిశ్చంద్రుడుస్వార్థత్యాగం చేశాడు !ఆశయమ్మునె నమ్మేడు ;ఆలుబిడ్డలను అమ్మేడు ! మహాత్ము డున్నాడు !గాంధీమహాత్ము డున్నాడు !దేశభక్తితో ముందుకు దూకీతెల్లదొరల నెదిరించాడు !కటకటాలలో పడి ప్రజలకోసంకటకట లాడాడు !భారతమాతపదాలముందు బ్రతుకారతి యిచ్చాడు !అహింసకోసం నిలబడి పాపం !హింసకు బలి యైపోయాడు !! రాములు ఉన్నాడు !పొట్టిరాములు ఉన్నాడు !ఆంధ్రులకోసం తృణప్రాయముగప్రాణము వదిలాడు ! ఆశయాలకై నిలబడువారేత్యాగులు ఔతారు !కర్మయోగులు ఔతారు !చరిత్రలో ఆమహానుభావులుచిరంజీవులై ఉంటారు !మహావీరు లై యశోమూర్తు లైమన మనసులలో ఉంటారు ! ——- ( 0 ) ——- 👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾