11_016 ద్విభాషితాలు – కొంతసేపైనా…

ఒకప్పుడు…

ఇల్లంతా కలిసి…

కబుర్లు చెప్పుకునేవారుట.

కేరంబోర్డు కోయిన్లతో..

కథల పుస్తకాలతో…

చదరంగం అడుగులతో.. వైకుంఠపాళీ నిచ్చెనలతో..

ఇల్లంతా ప్రతిరోజూ సందడేనట !

 

సాయంత్రాలు….

పెరట్లో..నలుగురూ కూర్చొని..

నవ్వుల్ని పూయించే వారుట.

కళ్ళ నిండా నిద్రపోయే వారుట.

కలల్లో తేలిపోయేవారుట.

 

నువ్వొచ్చావు!

ఇక అరచేతిలోనే స్వర్గం !

 

కూర్చున్నప్పుడు…

నిలుచున్నప్పుడు..

నడుస్తున్నప్పుడు…

నిద్రపోయే ముందు..

నిద్ర లేచాక…

అంతా నువ్వే.

 

అమ్మ నిమిషాలన్నీ నీవే!

అక్కయ్య అలంకారం నువ్వే!

అన్నయ్య నేస్తం నువ్వే!

బుల్లి తమ్ముడి కళ్ళు నీమీదే!

 

కానీ..

రోజు రోజు కీ …

నా మనసు ఖాళీ అయిపోతోంది.

బ్రతుకు చప్పగా వుంటోంది.

 

ఇప్పుడు…

నాకు… పంచుకోవడానికి…

అన్నయ్య కావాలి.

లాలించే అమ్మ కావాలి.

కబుర్లు చెప్పే అక్కయ్య కావాలి.

ఆడుకొని నింపుకోవడానికి… తమ్ముడు కావాలి.

 

ఓ చరవాణీ యంత్రమా!

మమ్మల్ని….

కొంతసేపైనా వదిలి పెట్టు !

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾