11_001 మా భారత జనయిత్రి

.

మా భారత జనయిత్రికి వందనాలు! వందనాలు!        

జనని పేరు వినగానే ఎద యెదలో స్పందనాలు!      

.

అరుణ రుధిర మర్పింతుము తల్లికి హరిచందనాలు!             

ఈ ప్రియతమ ధాత్రి యుండ ఎందుకు మరి నందనాలు!     

తూరుపు దిక్కునా సంధ్యా రాగం –  అది మా యెదలో కుసుమ పరాగం!                 

మనసూ మనసూ పూజా సుమాలుగా జనని కిత్తుమా సమ భాగం!     

    .

మా భారత జనయిత్రికి వందనాలు వందనాలు!            

జనని పేరు వినగానే ఎద యెదలో స్పందనాలు!     

.

గంగా తరంగాల సంగీత భంగిమలు మా తల్లికి నిరంతరం మంగళ గానం!      

ఉరకులతో పరుగులతో ఉప్పొంగే నదీజలం స్పందించే తల్లి ఎడద అందించే రాగరసం! 

.

మా భారత జనయిత్రికి వందనాలు వందనాలు!           

జనని పేరు వినగానే ఎదయెదలో స్పందనాలు స్పందనాలు!            

.

*******************************************************