.
మన స్థాయి, సంపద, హోదా వంటి విషయాలలో పెద్దా, చిన్నా అనే తేడాలు ఉండవచ్చేమో గాని మనిషి పుట్టుక, మరణం లో తేడాలుండవు. పుట్టేటప్పుడు ఇవేమీ లేకుండానే పుడతారు. పోయేటపుడు ఇవేమీ లేకుండానే వెళ్లిపోతారు. ఈ మధ్యలోనే పేద గొప్ప, కులమతాలు వంటి తేడాలు. పోయేటపుడు ఏమీ తీసుకెళ్లలేమని తెలిసి కూడా డబ్బు కోసం, అధికారం కోసం, పదవి కోసం, ఆస్తి కోసం…. ఇంకా శాశ్వతం కాని వాటి కోసం వెంపర్లాట, తోటి మనుష్యులను దోచుకోవడం, డబ్బు కోసం నానా గడ్డి కరవటం, ఎందుకు దాచుకుంటున్నారో తెలియకుండా దోచినదంతా దాచుకోవటం….
సాటి మనుష్యులు కూడా మనలాంటి వారే, వాళ్ళకి వచ్చిన కష్టం రేపు మనకి కూడా రావచ్చు అనే స్పృహ లేకుండా పోయింది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్లు ఈరోజు నా బొక్కసం నిండితే చాలు. ఎవరు ఎలా పోతే నాకేం అన్న ధోరణి పెరిగిపోయింది. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు అతడిని ఆదుకోవడం మానేసి ఎలా పీడిద్దాం అన్న ఆలోచన తప్ప ఎప్పుడో అప్పుడు మనం కూడా చనిపోక తప్పదు అనే ఆలోచన ఉన్నట్లు కనబడటం లేదు. ఇతరులను పీడించి సంపాదించినది ఏదీ మనం తీసుకువెళ్లలేం అని తెలుసుకుంటే నిజమైన మనిషి అనిపించుకుంటుంది.
గత సంవత్సరం కరోనా మనకి చాలా మంచి అలవాట్లు నేర్పింది. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం, ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు, పర్యావరణానికి హాని చేసే అనేక విషయాలకు దూరంగా ఉన్నారు. కరోనా కి పేద గొప్ప, కులమతాలు వంటి తేడాలు లేవని, దాని ముందు అందరూ సమానమే అని నిరూపించింది. ఉపాధి కోల్పోయిన ఇబ్బంది పడిన వారికి, తిండి లేక అలమటిస్తున్న వారికి ఎందరో మహానుభావులు, సంస్థలు ఆపన్న హస్తం అందించాయి. ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వలన అయితేనేమి, ప్రజలు క్రమశిక్షణ పాటించడం వలన అయితేనేమి మొత్తానికి కొంతకాలం తర్వాత కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. మనిషిలో వచ్చిన ఈ మార్పు శాశ్వతం అవుతుందనే ఆశ చిగురించింది.
అయితే అది ఎంతోకాలం నిలువలేదు. మనిషి లోని అసలు రూపం బయిటకు వచ్చింది. మళ్ళీ నిర్లక్ష్యంతో బాటు అన్ని అవలక్షణాలు పునః ప్రవేశం చేశాయి. వీటికి చిన్నా పెద్దా తేడా లేదు. కరోనా విలయ తాండవాన్ని అవకాశంగా తీసుకుని దోచుకోవడం మొదలయింది. కరోనా రెండవసారి విజృంభించింది. గత సంవత్సర అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు అన్నీ మర్చిపోయారు. గత సంవత్సరం కష్టకాలంలో తోటి వారికి అండగా నిలబడినవారు కూడా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. అవకాశం ఉన్నా వ్యాపారులలో, వైద్య రంగానికి చెందిన వారిలో చాలామంది మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా ఎంతగా విజృంభించిందో మందుల నల్ల బజారు, వైద్యం ఖర్చులు, నిత్యావసరాల ధరలు కూడా అంతకంటే ఎక్కువగా విజృంభించాయి. క్రిందటి సంవత్సరం అన్నిటినీ నియంత్రించిన ప్రభుత్వం కూడా ఈసారి ప్రేక్షక పాత్ర వహిస్తోందేమో అని సామాన్య జనానికి సందేహం కలుగుతోంది.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనాకు గురి కాకుండా చూసుకోవడమే అత్యంత ఆవశ్యకం. ఎవరికీ మన భద్రత పట్టదు. మన భద్రత మనదే ! ఈ విషయం గుర్తు పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తే కరోనా సోకే అవకాశం తగ్గడంతో బాటు ఈ నల్లబజారుకి, ఈ దోపిడీ లకి అడ్డుకట్ట పడే అవకాశం కూడా ఉంది. నిజానికి కరోనా వైరస్ కంటే ఈ వైరస్‌లు మరింత ప్రమాదకరమైనది. అందుకే ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టలేదు కదా అని అవసరం లేకపోయినా బయిట తిరగడం, సమూహాల్లోకి వెళ్లడం వంటివి చేయకుండా, మాస్క్, శుభ్రత వంటి జాగ్రత్తలు పాటించడం వంటివి తప్పకుండా పాటిస్తే ఇది తప్పక సాధ్యమవుతుంది.
త్వరలో మీ అభిమాన ‘ శిరాకదంబం ’ లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాల కోసం తదుపరి ప్రకటన వరకు వేచి చూడండి.
మనవి : ప్రతి పేజీలో క్రింద ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.
.
కృతజ్ఞతలు : మాపిలుపు కి స్పందించి ఇప్పటికే ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… క్రొత్తగా చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –
21. శ్రీ ఎస్. వి. రామచంద్రరావు, గుంటూరు – ఒక సంవత్సరం – ₹. 600/-
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
********************************************************
.
*********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…