13_005 పరాశర్ – కథక్ కళాకారుడు

అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువకుడు పరాశర్ వయసు 21 సంవత్సరాలు. కథక్ నృత్య గురువు శ్రీమతి స్వాతి సిన్హా వద్ద చిన్న వయసు నుంచే కథక్ నాట్యం అభ్యసించడం ప్రారంభించాడు. పరాశర్ తల్లి తల్లి శ్రీమతి  ఆత్మకూరి సంధ్యశ్రీ కూడా భరతనాట్య కళాకారిణి. అమెరికా లోని మిషిగన్ స్టేట్, రిసెప్టర్ లో నాట్య ధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే పేరుతో భరతనాట్య పాఠశాల నిర్వహిస్తున్నారు.

“తొలినాటి తెలుగు రాజవంశాలు”, ఇంకా అనేక చరిత్ర పుస్తకాలు తెలుగు, ఇంగ్లీషు భాష ల్లో రచించి, చారిత్రిక పరిశోధనలను చేసిన భావరాజు వెంకట కృష్ణారావు గారు, కీ. శే. డా. భావరాజు రామచంద్ర రావుగారి మునిమనుమడు ఈ పరాశర్. వారి పుస్తకాలు ఆక్స్ ఫోర్డ్ ముద్రణాలయం ద్వారా ప్రచురితమై ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ లైబ్రరీ లో ఉన్నాయి.

అమెరికాలో స్థిరపడినా మన దేశీయ సంస్కృతికి ఔన్నత్యం ఇస్తూ పరాశర్ కథక్ సాంప్రదాయంలో అమోఘమైన నృత్య ప్రదర్శన ఇచ్చాడు. అద్భుతమైన హావభావ ప్రదర్శన, విశిష్ట పదవిన్యాసంతో ప్రేక్షకులను అలరించాడు.

“ తాలీమ్ ” నిర్వహణలో ఢిల్లీ కథక్ కేంద్రంలో 2023వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఈ కార్యక్రమం ఆహుతులను ఆధ్యంతం ఆకట్టుకుంది. 

ఆ వీడియోలు ఇక్కడ…..

తాళ్ పరిచయ్ –  

మహాదేవి కె హోలీ –

­ ***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page